
కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
పెద్దపల్లి: జిల్లాలోని పుర, నగరపాలక సంస్థల్లోని పారిశుధ్య కార్మికుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిత్యం స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారని గుర్తించిన సర్కార్.. ప్రతినెలా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. వైద్యనిపుణులను అందుబాటులో ఉంచి పరీక్షలు చేయిస్తోంది. దీర్ఘకాలిక బీపీ, షుగర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేసి అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేస్తోంది.
అనేక వ్యాధుల బారిన కార్మికులు..
స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పారిశుధ్య కార్మికులు అనేక వ్యాధులకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దుమ్ము, ధూళి, పొగ, మురుగు వె లువడే ప్రాంతాల్లో రోజూ పనిచేస్తుండడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కార్మికుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పుర, నగరపాలికల్లో సుమారు 1,000 మందికిపైగా పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు.
కార్మికులకు సామాగ్రి పంపిణీ
జిల్లావ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులకు ఇటీవల వివిధ రకాల సామగ్రి అందజేశారు. ఇందులో నూనె, బెల్లం, సబ్బులు, చెప్పులు, దుస్తులు ఉన్నాయి. కార్మికుల ఆరోగ్యం బాగుంటేనే పారిశుద్ధ నిర్వహణ సజావుగా సాగుతుందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రతీ కార్మికుడిపై ప్రత్యేక శ్రద్ధ