
‘సపోర్ట్’ తిప్పలు
విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన సపోర్ట్ వైర్లు ఇంటి యజమానులను భయపెడుతున్నాయి. ఇంటిగేట్‌కు సపోర్ట్‌గా ఉన్న దిమ్మెకు సిబ్బంది విద్యుత్ సపోర్ట్ వైర్ కట్టారు. దీంతో గేటు దిమ్మె పగిలిపోతోంది. నేలలో పాతాల్సిన సపోర్ట్ వైర్‌ను పిల్లర్ దిమ్మెకు కట్టడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇంటి యజమానులు భయపడుతున్నారు. పెద్దపల్లి బ్రాహ్మణవాడ 13వ వార్డులో కరెంట్‌పోల్ సపోర్ట్ వైర్‌తో తాము తిప్పలు పడుతున్నామని, వాటిని తొలగించాలని బాధితుడు కృష్ణశర్మ అధికారులను కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి