
వ్యాపార ధోరణి వద్దు
కార్మికుల సంక్షేమం కోసం కమ్యూనిటీహాళ్లు నిర్మించారు. వ్యాపార ధోరణిలో కాకుండా వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలి. మా యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు అద్దె పెంపును వ్యతిరేకించాం.
– ఐలి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు, టీబీజీకేఎస్
పెంపు అన్యాయం
కార్మిక కుటుంబాల కోసం నిర్మించిన కమ్యూనిటీహాల్ అద్దె నామమాత్రంగానే ఉండాలి. ఏసీల విద్యుత్ చార్జీలు కార్మికులే భరిస్తున్నారు. సీఎస్‌ఆర్ నిధుల పేరుతో ఇతర ప్రాంతాలకు నిధులు కేటాయిస్తున్నారు. ఇది సరికాదు.
– బదావత్ శంకర్‌నాయక్, ఉపాధ్యక్షుడు, ఐఎన్‌టీయూసీ
తగ్గించేలా చూస్తాం
సింగరేణి యాజమాన్యంతో ఈనెల 15న స్ట్రక్చర్ కమిటీ సమావేశం ఉంది. కమ్యూనిటీ హాల్ అద్దె పెంపును ఉపసంహరించుకునేలా సమావేశంలో యాజమాన్యంతో చర్చిస్తాం. అధికారులు వినకుంటే ఆందోళనలు చేస్తాం.
– జిగురు రవీందర్, ఉపాధ్యక్షుడు, గుర్తింపు యూనియన్

వ్యాపార ధోరణి వద్దు

వ్యాపార ధోరణి వద్దు