
వేగంగా జెడ్పీ భవన నిర్మాణం
పెద్దపల్లిరూరల్: జెడ్పీ కార్యాలయం కోసం తహసీ ల్దార్ ఆఫీసు ఆవరణలో చేపట్టిన కాంప్లెక్స్ నిర్మా ణంలో వేగం పెంచి ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం ని ర్మాణ ప్రగతిని పరిశీలించారు. పనుల నాణ్యత ప ర్యవేక్షించాలన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, పీఆర్ ఈఈ గిరీశ్‌బాబు, తహసీల్దార్ రాజయ్య ఉన్నారు.
యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. రానున్న పదేళ్ల అవసరాలకు అనుగుణంగా సర్కా రు బడుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని కలెక్టర్ అన్నారు. అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఈజీఎస్ పనుల ఎంబీ రికార్డులు సమర్పించాలని సూచించారు. వివిధ పనులపై కలెక్టర్ ఆరా తీశారు.
ఆర్థికంగా స్వావలంబనకు రుణాలు
కోల్‌సిటీ(రామగుండం): స్వశక్తి సంఘాలు, వీధి వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా బ్యాంక ర్లు రుణాలు మంజూరు చేయాలని రామగుండం న గరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. బల్దియా కార్యాలయంలో సోమవారం పట్టణస్థా యి బ్యాంక్‌అధికారుల కమిటీ (టీఎల్‌బీసీ) సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ, సీ నియారిటీ ప్రాతిపదికన స్వశక్తి సంఘాలకు బ్యాంక్ లింకేజీ, వీధివ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలు మంజూరు చేయాలన్నారు. రికవరీ చేయడంలో సీ వోలు, ఆర్పీలు వారికి సహకరించాలని సూచించా రు. వ్యాపార యూనిట్లు స్థాపించుకునేలా స్వశక్తి మ హిళలను చైతన్యపరచాలని కోరారు. లీడ్‌బ్యాంక్ మే నేజర్ వెంకటేశ్ సూచనలుచేశారు. అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, మెప్మా టీఎంసీ మౌనిక, బ్యాంకర్లు శ్రావణ్‌కుమార్, కిషన్‌రెడ్డి, నిషానిఝా పాల్గొన్నారు.

వేగంగా జెడ్పీ భవన నిర్మాణం