
పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం
గోదావరిఖని: పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి సోమవారం ఆయన సేఫ్టీకిట్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. చలి, వానాకాలాల్లో ఉపయోగపడేలా వులెన్ దుప్పటి, జాకెట్, కాటన్ టీషర్ట్, రెయిన్ కోట్స్ స్పెషల్ పార్టీ సిబ్బందికి పంపిణీ చేశామని అన్నారు. ప్రతీఉద్యోగి వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీ లు నిర్వహిస్తున్నట్లు సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ‘డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు’ అంశంపై పోటీలు వ్యాసాలు రాయాలన్నారు. తెలు గు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రాయాలని, ఆరో తర గతి నుంచి పీజీ వరకు చదువుతున్నవారు అర్హుల న్నారు. వ్యాసాలను ఈఎల 28వ తేదీలోగా సమర్పించాలని ఆయన సూచించారు. ఇందుకోసం తమ వివరాలను https://forms.gle/jaWLdt2yh NrMpe3eA వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కోరారు.