
సీపీఆర్‌పై అవగాహన ఉండాలి
పెద్దపల్లిరూరల్: కార్డియో పల్మనరీ రెసిపిటేషన్ (సీపీఆర్)పై కనీస అవగాహన ఉండాలని జి ల్లా వైద్య, ఆరోగ్య శాఖఅధికారి వాణిశ్రీ అన్నా రు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో సోమవారం సీపీఆర్‌పై అవగాహన క ల్పించారు. అకస్మాత్తుగా గుండె ఆగితే శ్వాస కొనసాగుతున్నదా లేదా వెంటనే పరిశీలించాలని, ఆ తర్వాత 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వాలన్నారు. వాహనం వచ్చేలోగా సీపీఆర్ చేయడంతో పునర్జీవనం కల్పించవచ్చని డీఎంహెచ్‌వో తెలిపారు. ఈనెల 17వ తేదీ వరకు అ వగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నా రు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు రాజమౌళి, శ్రీరాములు, కిరణ్‌కుమార్, లక్ష్మీభవాని, ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి, సిబ్బంది రాజేశం, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
జూలపల్లి(పెద్దపల్లి): ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణతో సమాజంలో శాంతి, మానసిక ప్రశాంతత చేకూరుతుందని కరీంనగర్‌లోని పంచము ఖ హనుమాన్ ఆలయ పీఠాధిపతి బ్రహ్మనందగిరి స్వామీజీ అన్నారు. స్థానిక శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం జరిగిన రు ద్రాభిషేకం కార్యక్రమానికి పీఠాధిపతి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు గావించారు. ఆలయ పునర్మిణదాత నల్ల మనోహర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాటకుల అనిల్, సభ్యులు పోట్యాల మల్లేశం, వజ్రారెడ్డి, రమేశ్, శంకరయ్య, వెంకటరమణ, మడ్లపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగుండంలో గల సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)కాలేజీకి అనుబంధంగా పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈనెల 28లోగా దరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్ తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం పారామెడికల్‌బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. డీఎంఎల్‌టీ కోర్సులో 30 సీట్లు, డయాలసిస్‌లో 30 సీట్లు ఉన్నాయని వివరించారు. ఆయా కో ర్సుల్లో చేరేందుకు ఇంటర్ బైపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని 74 మద్యం దుకాణాలకు ఆదివారం వరకు 49 టెండర్లు అందగా.. సోమవారం 25 దరఖాస్తులు దాఖలయ్యాయని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి తెలిపారు. 36 వైన్స్‌షాప్‌ల కోసమే మొత్తంగా 74 టెండర్లు దాఖలు చేశారని, మిగ తా వాటికి ఒక్క టెండరు కూడా రాలేదని ఆ యన పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉందన్నారు.
గోదావరిఖనిటౌన్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవే శాల కోసం అపరాధ రుసుం లేకుండా అడ్మిష న్ ఫీజు గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ జైకిషన్ ఓజ, అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ జి.సుబ్బారావు తెలిపారు. ఇంటర్మీడియట్, డిప్లొమా, 10+2 ఉత్తీర్ణులైనవారు నేరుగా ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించాలని, వివరాలకు 73829 29655 నంబర్‌లో సంప్రదించాలని వారు కోరారు.

సీపీఆర్‌పై అవగాహన ఉండాలి