
మొగులు.. దిగులు
మొన్నటివరకు భారీవర్షాలు తాజాగా ఆకాశంలో మబ్బులు తెల్లబంగారం దిగుబడిపై ప్రభావం కపాస్ కిసాన్ యాప్‌పైనా రైతులకు అవగాహన లోపం కంటిమీద కనుకులేని అన్నదాత
మద్దతు ధర కోసమే..
‘కపాస్ కిసాన్’
జిల్లాలో పత్తి సాగు సమాచారం
సిరులు కురిపిస్తుందనుకున్న తెల్లబంగారం.. మొన్నటివరకు కురిసిన అధిక వర్షాలు, రెండ్రోజులుగా ఆకాశంలో కమ్ముకుంటున్న కారుమబ్బులు అన్నదాత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చేను జాలువారి, పంట ఎర్రబడి దిగుబడి గణనీయంగా పడిపోతుందనే ఆందోళన రైతును వెంటాడుతోంది. చేతికొచ్చిన పంటను విక్రయిద్దామన్నా కేంద్రప్రభుత్వం ఈసారి అందుబాటులోకి తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్ యాప్’లో వివరాల నమోదు వ్యవసాయదారుల ఆశను గల్లంతు చేస్తోంది.
పెద్దపల్లిరూరల్:
జిల్లాలో ఈసారి 48,215 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 5,78,580 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. మొన్నటివరకు కురిసిన వర్షాలకు చేలలో వర్షపునీరు నిలిచింది. చేను జాలువారింది. కొన్నిప్రాంతాల్లో మొక్క ఆకులు ఎర్రబడి, కా యలు నల్లరంగులోకి మారాయి. ఆది, సోమవారా ల్లో ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకోవడం, కొన్నిప్రాంతాల్లో చిరుజల్లులు సైతం కురవడంతో పంట చేతికొస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వీటితో దిగుబడిపై పెద్దగా ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు.
● జిల్లాలో ఐదు సీసీఐ కేంద్రాలు..
సీసీఐ ద్వారా జిల్లాలో ఐదు పత్తి కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేస్తారు. ఇందులో పెద్దపల్లి వ్యవసా య మార్కెట్, రాఘవాపూర్, నిమ్మనపల్లి, కమాన్‌పూర్ పరిఽధిలోని గొల్లపల్లి, సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల జిన్నింగ్ మిల్లుల్లో పత్తి సేకరిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఇప్పటికే ఆదేశించారు.
● పెరిగిన మద్దతు రూ.589
పత్తి క్వింటాల్‌కు ఈసారి రూ.589 మద్దతు ధర పెరిగింది. తేమశాతం 8 ఉంటే గతంలో క్వింటాల్‌కు రూ.7,521 ధర చెల్లించగా, ఈసారి రూ.8,110 చెల్లిస్తారని చెబుతున్నారు.
● ఆన్‌లైన్ నమోదుతోనే కొనుగోళ్లు..
పత్తి సాగు చేసిన రైతులు, కౌలుదారులు తమ వివరాలను నమోదు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఈ సారి కపాస్ కిసాన్ యాప్‌ను అందుబాటులోకి సుకొచ్చింది. దానికి అనుబంధంగా రాష్ట్రప్రభుత్వం కూడా డిజిటల్ పద్ధతిన సాఫ్ట్‌వేర్ రూపొందించింది. రైతులు, కౌలురైతులు తమ వివరాలు, పత్తి విక్రయించే ప్రాంతాన్ని ఆన్‌లైన్ ఎంచుకుని, అదేరోజు వెళ్లేలా యాప్‌లో అవకాశం కల్పించారు.
● పొరుగు జిల్లాల నుంచి రాక..
జిల్లాలో పత్తి ఇంకా చేతికి రాలేదు. కానీ, పొరుగున ఉన్న ఆదిలాబాద్, నల్లగొండ తదితర జిల్లాల నుంచి స్థానిక జిన్నింగ్ మిల్లులకు పత్తి వస్తోంది. జిన్నింగ్ మిల్లు యజమానులు క్వింటాల్‌కు రూ.6వేల నుంచి రూ.7వేల వరకు ధరతో కొనుగోలు చేస్తున్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని జిన్నింగ్ మిల్లులో నల్లగొండకు చెందిన పత్తి కొనుగోలు చేశారు.
పత్తిరైతులకు మద్దతు ధర కల్పించేందుకే కేంద్రప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని అధికారులు వివరిస్తున్నారు. ఎంపికచేసిన వ్యవసాయ మార్కెట్, సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించేవారు ఈనెల 1 నుంచి 30వ తేదీ వరకు యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రైతు పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పట్టాదారు పాసుబుక్, బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబరు, సాగు విస్తీర్ణం తదితర వివరాలు నమోదు చేయాలి. యాప్‌పై చాలామంది రైతులకు అవగాహన లేదు. అయినా, రైతులకు ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే క్రాప్ బుకింగ్ వివరాలను వారు నమోదు చేశారు. ఎన్‌ఐసీ ద్వారా ఆ వివరాలను రైతు ఆధార్, మొబైల్ నంబరు నమోదు చేస్తే ఆటోమేటిక్ ఎంటరవుతాయంటున్నారు.
సాగు(ఎకరాల్లో) 48,215
దిగుబడి(క్వింటాళ్లలో) 5,78,580
కనీస మద్దతు ధర
(క్వింటాల్‌కు రూ.లలో)8,110
ఏర్పాటయ్యే సీసీఐ కేంద్రాలు 05

మొగులు.. దిగులు

మొగులు.. దిగులు