
రూ.45 కోట్లతో ఏటీసీ
మంథని: అభివృద్ధే ద్యేయంగా ముందుకు సాగుతు న్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మంథకి రూ.45 కోట్లతో ఏర్పాటు చేసే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) మంజూరైందన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంథని, రామగిరి, కమాన్‌పూర్, ముత్తారం మండలాలకు చెందిన 87 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి, 38 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను సోమవారం ఆయ న పంపిణీ చేసి మాట్లాడారు. మంథని నియోజకవర్గాన్ని సరస్వతీ నిలయంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేలా ఐటీఐ కేంద్రాలను ఆధుని క సాంకేతిక కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేశామని, ఏటీసీ కోర్సులు పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు ల భిస్తాయన్నారు. ఇటీవల కాటారంలో రూ.35 కోట్ల తో ఏటీసీ ప్రారంభించామని తెలిపారు. వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీహాల్స్ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ కుమారస్వామి, నాయకులు శశిభూషణ్ కాచే, శ్రీనివాస్, మంథని సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ నాయకులు
కాటారం మండలంఽ ధర్మసాగర్‌కు చెందిన బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీసర్పంచ్ మాదరి రాజు, యూత్ కాంగ్రెస్ నేత పొట్ల శ్రీనివాస్ ఆధ్వరంలో తోట ముత్తయ్య, మల్లికార్జున్, కలికి స మ్మయ్య, చిన్న మల్లికార్జున్, కోరబోయిన సత్యనా రాయణ, మాదరబోయిన సతీశ్, గడిపెల్లి రవి తది తరులు కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో ఉన్నారు.
పుట్టపాకలో బస్‌షెల్టర్ ప్రారంభం
మంథనిరూరల్: పుట్టపాకలో నిర్మించిన మాజీస్పీ కర్ శ్రీపాదరావు స్మారక బస్ షెల్టర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుదుడుల వెంకన్న, టీజీఈఆర్సీ సలహాదా రు శశిభూషణ్‌కాచే, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.