
అద్భుత కట్టడం.. నాగులపేట సైఫన్
● ఆసియాలోనే అరుదైన కట్టడంగా గుర్తింపు
కోరుట్ల రూరల్: ఇంజినీరింగ్ పనితీరుకు అద్భుత కట్టడంగా నిలుస్తుంది కోరుట్ల మండలం నాగులపేట వద్దగల సైఫన్. ఇది ఆసియాలో అరుదైన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అప్పటి సూపరింటెండెంట్ ఇంజనీర్ పీఎస్.రామకృష్ణారాజు సైఫన్ నిర్మాణానికి డిజైనింగ్ చేశారు. నాగులపేట వద్ద కాకతీయ కాలువ సుమారు 100 మీటర్ల వెడల్పుతో ప్రవహించే పెద్దవాగు దాటాల్సి ఉంటుంది. వాగుకు అడ్డంగా కాలువ నిర్మించడం కష్టం కావటంతో వాగుపై నుంచే 100 మీటర్ల సొరంగమార్గం తవ్వి.. ఎప్పటిలాగే వాగు ప్రవహించేలా డిజైన్ చేశారు. 100 మీటర్ల పొడవు.. సుమారు 30 ఫీట్ల లోతు.. 25 ఫీట్ల వెడల్పుతో సైఫన్ నిర్మాణం చేపట్టారు. సైఫన్ సొరంగమార్గం ద్వారా కాలువ నీరు.. వాగులో వరద ప్రవాహం.. ఈ అద్భుత కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.

అద్భుత కట్టడం.. నాగులపేట సైఫన్

అద్భుత కట్టడం.. నాగులపేట సైఫన్