
రాయికల్ శివాలయంలో చోరీ
పోలీస్‌ల అదుపులో నిందితుడు?
రాయికల్: రాయికల్ పట్టణంలోని శివాలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోని హుండిని పగలగొట్టి నగదును దొంగలించారు. దొంగ ముందస్తుగా సీసీ కెమెరాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించాడు. దానికి ముందు రికార్డయిన వీడియో ఆధారంగా ఆదివారం సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇల్లంతకుంట(మానకొండూర్):ఓ మైనర్ బాలిక నగ్న వీడియోలు చిత్రీకరించి, ఇతరులకు పంపించిన యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బాలిక నగ్న వీడియోలు తీసిన యువకుడు గతంలో గంజాయి కేసులో నిందితుడు అని ప్రచారంలో ఉంది. ఈ వీడియోలు ప్రస్తుతం వెలుగుచూడడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవల మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక ఆత్మహత్య ఉదంతం మరిచిపోకముందే మరో మైనర్ నగ్న వీడియోలు చిత్రీకరించినట్లు వెలుగులోకి రావడం మండలంలో చర్చకు దారితీసింది.
పిడుగుపాటుకు కాలిపోయిన ట్రాక్టర్
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున భారీవర్షం కురిసింది. ఈక్రమంలో పిడుగుపడి ట్రాక్టర్ స్ట్రీరింగ్ కాలిపోయింది. గ్రామంలోని చెట్టుపై పిడుగుపడగా దానికిందనే పార్క్‌చేసిఉన్న గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ కాలిపోయింది.

రాయికల్ శివాలయంలో చోరీ