
ఉత్సాహంగా రోలార్ స్కేటింగ్ పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్/కరీంనగర్‌రూరల్: అంబేడ్క ర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఉ మ్మ డి జిల్లాస్థాయి రోలార్ స్కేటింగ్ పోటీలకు స్పందన వచ్చింది. అల్ఫోర్స్ విద్యాసంస్థల అ ధినేత వి.నరేందర్‌రెడ్డి పోటీలు ప్రారంభించా రు. క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అలాగే బొమ్మకల్‌లోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్‌లో రోడ్ ఈవెంట్ స్టేట్ సెలక్షన్ పోటీలు నిర్వహించారు. స్కేటింగ్ బాధ్యులు విజయభాస్కర్, గట్టు అనిల్‌కుమార్‌గౌడ్, డి.వీరన్న, కృష్ణమూర్తిగౌడ్, సాయినరహరి తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ పోటీలకు స్పందన
కరీంనగర్‌స్పోర్ట్స్: అంబేడ్కర్ స్టేడియంలో ఆది వారం నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు స్పందన వచ్చింది. వివిధ మండలాల నుంచి సుమారు 150 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్‌రావు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఈ నెల 25 నుంచి నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలంలో జరిగే రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కబడ్డీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర ఎల్లయ్యగౌడ్, సీహెచ్.మల్లేశ్, ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశ్‌గౌడ్, పెటా కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు మాధవరెడ్డి, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా రోలార్ స్కేటింగ్ పోటీలు