‘సర్కార్‌ వైఫల్యమే కారణం’ | - | Sakshi
Sakshi News home page

‘సర్కార్‌ వైఫల్యమే కారణం’

Sep 15 2025 7:55 AM | Updated on Sep 15 2025 7:55 AM

‘సర్క

‘సర్కార్‌ వైఫల్యమే కారణం’

పెద్దపల్లిరూరల్‌: రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పాలకులు.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ సరిపడా యూరియా అందించినా రైతులకు పంపిణీ చే యలేని నిస్సహాయస్థితిలో ఉన్నారని బీజేపీ రా ష్ట్ర నాయకుడు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరి సా గు చేస్తున్న రైతుల కోసం 6.12లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని రాష్ట్రం వి న్నవించగానే కేంద్రప్రభుత్వం సమకూర్చిందన్నారు. రాష్ట్రంలో 1.76లక్షల నిల్వలు ఉన్నా కొరత ఏర్పడడం సందేహాలకు తావిస్తోందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకని రైతులకు సరిపడా యూరియా అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీజేపీ సుల్తానాబాద్‌ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్‌, జీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు కనుకుంట్ల జోగేందర్‌, నాయకుడు బొడ్డుపల్లి కుమార్‌ పాల్గొన్నారు.

ఐక్య ఉద్యమాలే శరణ్యం

గోదావరిఖని: కార్మికుల హక్కుల సాధన కో సం గుర్తింపు యూనియన్‌ ఏఐటీయూసీ ఐక్య ఉద్యమాలకు ముందుకు రావాలని జీఎల్‌బీకేఎస్‌ గౌరవ సలహాదారు టి.శ్రీనివాస్‌ కోరారు. స్థానిక ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగిన ము ఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నేతలు.. కార్మికులకు ఆదాయ పన్ను, పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్‌ రద్దు, సొంత ఇంటి పథకం, నూతన గనుల ఏర్పాటు, వారసత్వ ఉద్యోగాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చాయని గుర్తుచేశారు. ఆ హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. హామీల అమలుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. నాయకులు జె.సీతారామయ్య, ఎ.వెంకన్న, డి.బ్రహ్మానందం, ఎండీ రాసుద్దీన్‌, గౌని నాగేశ్వరరావు, ఇ.నరేశ్‌, టి.శ్రీనివాసు, జి.మల్లేశ్‌, ఎస్‌.నర్సింగం, ఐ.రాజేశం, ఎం.సిద్దయ్య, కొండపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు బంద్‌ పాటించాలి

జ్యోతినగర్‌(రామగుండం): మేడిపల్లి సెంటర్‌లోని నిర్మాణాల కూల్చివేతల్లో పారదర్శకత పాటించాలనే డిమాండ్‌తో సోమవారం చేపట్టిన పట్టణ బంద్‌ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. తొలుత మెయిన్‌ రోడ్డు వెడల్పు 40 అడుగులు విస్తరించాలని మార్కింగ్‌ ఇవ్వగా, దానిని 35 అడుగులకు కుదించి మార్కింగ్‌ ఇచ్చారన్నారు. మున్సిపల్‌ సిబ్బంది మళ్లీ 40 అడుగుల వరకు విస్తరించాలని, ఈక్రమంలో అవరోధంగా ఉ న్న కట్టటడాలను కూల్చివేయాలనడంతో వ్యా పారులు భయబ్రాంతులకు గురవుతున్నారని మండిపడ్డారు. బల్దియా సిబ్బంది తీరు సరికాదన్నారు. ఈమేరకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రచార పోస్టర్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.

మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ

గోదావరిఖనిటౌన్‌: మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా నగరంలో ఆదివారం ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీనగర్‌ మదర్సా నుంచి ప్రధాన చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ నాయకులు మహమ్మద్‌ నసీర్‌, షేక్‌ హజీ అలీ, మహమ్మద్‌ షరీఫ్‌, ఉమర్‌, హబీబ్‌, గులాం సాబ్రి, గౌస్‌, కలీమ్‌, నజీమొద్దీన్‌, షేక్‌ అలీ, రియాజ్‌, ముబీన్‌, జానీ పాల్గొన్నారు.

‘సర్కార్‌ వైఫల్యమే కారణం’1
1/3

‘సర్కార్‌ వైఫల్యమే కారణం’

‘సర్కార్‌ వైఫల్యమే కారణం’2
2/3

‘సర్కార్‌ వైఫల్యమే కారణం’

‘సర్కార్‌ వైఫల్యమే కారణం’3
3/3

‘సర్కార్‌ వైఫల్యమే కారణం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement