
అన్నం పెట్టని కొడుకు
జగిత్యాలక్రైం: కొడుకు అన్నం పెట్టడంలేదని, అడిగినా పట్టించుకోవడంలేదని జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన బొల్లె భూమయ్య, కొమురవ్వ దంపతులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. భూమయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు గతంలో మరణించాడు. పెద్ద కుమారుడు రెండు నెలలుగా అన్నం పెట్టకపోవడంతో దంపతులిద్దరూ బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో కాలం వెళ్లదీశారు. తమకు అన్నం పెట్టడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ రూరల్ ఎస్సై సదాకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వారి పెద్ద కొడుకు, చిన్న కొడుకు కుటుంబ సభ్యులను పిలిచించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వృద్ధుల పోషణభారం చూసుకోవాలని, మరోసారి విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.