
వివాహేతర సంబంధం బహిర్గతం.. అవమానంతో ఆత్మహత్య
ముత్తారం(మంథని): వివాహేతర సంబంధం బయటపడిందనే అవమానభారంతో మచ్చ నరేశ్(32) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నరేశ్ – స్వాతి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేశ్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యతో తరచూ గొడవపడుతున్నాడు. ఇటీవల భార్యను కొట్టి పిల్లలతో పుట్టింటికి పంపించాడు. ఆ తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో ఉండగా.. విషయం తెలుసుకున్న స్వాతి తన సోదరుడితో కలిసి మంగళవారం రాత్రి తన భర్తను, ఆ మహిళను పట్టుకుంది. ఆ తర్వాత స్థానిక పోలీస్‌స్టేషన్ భర్త, మహిళపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెఇంగ్ ఇచ్చి ఇంటికి పంపించివేశారు. అయితే, భర్త తనకు వద్దని భావించిన స్వాతి.. పెద్దపల్లిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బుధవారం ఉదయం వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న నరేశ్.. అవమానం భరించలేక మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త చావుకు కారణమైన మహిళపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ మధునయ్య తెలిపారు.
బుగ్గారం: న్నాపూర్‌కు చెందిన పరుమాల గంగా రాజం (58) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గంగారాం కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. విరక్తి చెందిన ఆయన బుధవారం ఉరేసుకున్నాడు.
విషజ్వరంతో యువకుడు..
రామగిరి(మంథని): రత్నాపూర్ గ్రామానికి చెందిన జక్కుల సతీశ్(28) విషజ్వరంతో మృతి చెందాడు. స్థానికుల కథ నం ప్రకారం.. వారంరోజు ల క్రితం సతీశ్‌కు జ్వరంరా గా కమాన్‌పూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయినా జ్వరం తగ్గలేదు. దీంతో కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
కరీంనగర్: తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్) రీజనల్ లెవల్ కో ఆర్డినేటర్‌గా కొనసాగుతున్న కనపర్తి సురేశ్‌ను బుధవారం ఆర్‌ఎల్‌సీ బాధ్యతల నుంచి తొలగిస్తూ టీఎంఆర్‌ఈఐఎస్ రాష్ట్ర సెక్రటరీ షఫిఉల్లా ఉత్తర్వులు జారీ చేశారు. సురేశ్‌పై నిధుల దుర్వినియోగం, ఉద్యోగుల పట్ల సరిగా వ్యవహరించకపోవడం తదితర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆరోపణలు నిజమేనన్న నివేదికను జిల్లా కలెక్టర్.. రాష్ట్ర మైనార్టీ సెక్రటరీకి పంపడంతో సురేశ్‌ను తొలగించి కరీంనగర్ పట్టణంలోని బాలురు–2 మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు.