
అట్టహాసంగా రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: సింగరేణి 54వ జోనల్ స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలు బుధవారం మెయిన్ రెస్క్యూస్టేషన్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 6 పురుషులు, 2 మహిళా జట్లు హాజరయ్యాయి. సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు, డీఎంఎస్ ఉమేశ్ సావర్కర్ పోటీలు ప్రారంభించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రతినిధులను నాగ్‌పూర్ జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో కార్పొరేట్ సేఫ్టీ జీఎం శ్రీనివాస్, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్జీ –1, 3 జీఎంలు లలిత్‌కుమార్, సుధాకర్‌రావు, డీడీఎంఎస్‌లు తదితరులు పాల్గొన్నారు.