కొత్తపల్లి(కరీంనగర్): ముప్పై ఐదేళ్లుగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న అల్ఫోర్ప్ విద్యా సంస్థల చైర్మన్ డా.నరేందర్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘అవుట్‌స్టాండింగ్ ఎడ్యూకేషన్ అడ్మినిస్ట్రేటర్’ అవార్డు వరించింది. ఢిల్లీకి చెందిన ఇండియన్ స్కూల్ అవార్డ్స్, వరల్డ్ ట్రేడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్తంగా అవార్డు ప్రకటించాయి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వీఎన్‌ఆర్ తరుఫున అల్ఫోర్స్ విద్యా సంస్థల ప్రతినిధి అవార్డును అందుకున్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా బుధవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో నరేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా అవార్డు బాధ్యత పెంచిందని, రానున్న రోజుల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థలు మరిన్ని అత్యుత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా రాష్ట్ర విద్యారంగానికి గొప్ప మార్గదర్శకంగా నిలిచేలా కృషి చేస్తానని నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.