
వీరవనతికు ఘననివాళి
పెద్దపల్లిరూరల్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత, ధీరశాలి చాకలి ఐల మ్మ అని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కా ర్యక్రమంలో బీసీ వెల్పేర్ ఆఫీసర్ రంగారెడ్డి, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
పారిశుధ్యంపై నిర్లక్ష్యం వద్దు
రామగిరి(మంథని): పంచాయతీ అధికారు లు, కార్యదర్శులు పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పంచా యతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య హెచ్చరించారు. కల్వచర్ల గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. పారిశుధ్య పనులు పరిశీలించారు. క్లోరినేషన్ చేపట్టాలని, మురుగునీటికాలువలు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా రోజూ పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. ప్రతీవారం చేపట్టే డ్రై డేలో అధి కారులు పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ఉమేశ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఎస్జీఎఫ్ పోటీలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూ నియర్ కళాశాల మైదానంలో చేపట్టిన జోనల్ స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు బుధవారం ము గిశాయి. ఈ సందర్భంగా డీవైఎస్‌వో సురేశ్ మాట్లాడుతూ, క్రీడాకారులు గెలుపోటముల ను సమానంగా తీసుకోవాలన్నారు. విద్యార్థు లు చదువుతోపాటు క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని ఆయన సూచించారు. సుల్తానాబాద్, ఓదెల, జూలపల్లి, ఎలిగేడు మండలాలకు చెందిన 800 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. విజేతలకు సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు అమిరిశెట్టి తిరుపతి, దాసరి రమేశ్, ప్రణయ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు టీఎల్‌ఎం మేళా
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. మండలస్థాయి మేళాలో ప్రతిభ కనబర్చిన 10మంది ఉపాధ్యాయులు(ప్రతీ మండలం నుంచి) జిల్లాస్థాయి మేళాలో పా ల్గొంటారని డీఈవో పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన 8 మందిని రాష్ట్రస్థాయి మేళాకు ఎంపిక చేస్తామని వివరించారు.
గూగుల్ పేలో ఉద్యోగాలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు గూగుల్ పే హైరింగ్ రిక్వెస్ట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి ఉపాధికల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. కలెక్టరేట్ లోని రూం నంబరు 225లో నిర్వహించే ఈ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు సర్టిఫికెట్ల జి రాక్స్ వెంట తీసుకు రావాలని సూచించారు. వివరాలకు 80964 34123, 81212 62441 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
రైల్వే ట్రాక్ పనుల పరిశీలన
ఓదెల(పెద్దపల్లి): కాజీపేట, ఓదెల, పొత్కపల్లి, కొలనూర్ రైల్వేస్టేషన్ల మధ్య చేపట్టిన రైల్వేట్రాక్ పనులను దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. రైళ్ల వేగం పెంచేందుకు కొద్దిరోజులుగా ట్రాక్‌కింద కొత్త సిమెంట్ స్లీపర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల ప్రగతి తెలుసుకునేందుకు డీఆర్‌ఎం ఓదెలకు ప్రత్యేక రైలులో చేరుకున్నారు. స్లీపర్ మార్చే పనులను ఆయన పర్యవేక్షించారు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టం అమలు కోసం చేపట్టిన కొత్త పట్టాలు, స్లీపర్ పనులను వేగవంతం చేయాలని డీఆర్‌ఎం సిబ్బందికి సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు తదితరులు ఉన్నారు.

వీరవనతికు ఘననివాళి