
చదువు నేర్పిన బడి అభివృద్ధికి కృషి
పెద్దపల్లిరూరల్: ‘నేను చదువు నేర్చుకున్నది ఈ పాఠశాలలోనే.. కష్టపడి చదివితే ఉన్నతంగా ఎదగొచ్చు.. మీరంతా క్రమశిక్షణతో లక్ష్య సాధనకు పాటుపడాలి’ అని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య విద్యార్థులకు సూచించారు. అ ప్పన్నపేట జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం ఆ యన సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో తన జ్ఞాపకాలు పంచుకున్నారు. బందంపల్లి నుంచి అప్పన్నపేట వరకు నడుచుకుంటూ వచ్చిన ఆనాటి జ్ఞాపకాలను వివరించారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ ని, విద్యార్థులు సెల్‌ఫోన్‌లతో కాలయాపన చే యకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలని సూచించారు. ఓ విద్యార్థిని మీరు.. పూర్తిస్థా యి రాజకీయ నాయకుడిగా ఎందుకు ఉండ డం లేదని అడగ్గా.. కష్టాల నుంచి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఉన్నతంగా ఎదిగానని, ఆ కారణంగా జాతీయ పార్టీ నాయకులు తనకు ఎమ్మెల్సీ గా పోటీచేసేందుకు అవకాశం ఇచ్చారని కొ మురయ్య బదులిచ్చారు. తాను చదువుకున్న బడిలో మీరు చదువుకుంటున్నారని, మీకు అవసరమైన వసతుల కల్పనకు సహకారం అందిస్తానని ఆయన అన్నారు. పాఠశాల మైదానం చదును చేయించడంతోపాటు ఇంగ్లిష్ సబ్జెక్టు బోధనకు ట్యూటర్ కావాలని విద్యార్థులు విన్నవించగా.. సానుకూలంగా స్పందించారని, విద్యార్థులకు డ్యూయల్ డెస్క్‌లను కూడా సమకూరుస్తానని హామీ ఇచ్చారని హెచ్‌ఎం పురుషోత్తం తెలిపారు.
17 నుంచి మహిళా వైద్య శిబిరాలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మహిళల ఆరోగ్యం కోసం ఈనెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక వైద్య శిబిరాలను స్వస్థ్ నారీ శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం పేరిట నిర్వహిస్తామని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ బుధవారం తెలిపారు. మహిళలు, యుక్తవయసుగల వారికే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి నుంచి గైనకాలజిస్ట్, డెంటల్ తదితర వైద్య నిపుణులు వైద్య పరీక్షలు చేస్తారని వివరించారు.