
ప్రముఖ విద్యాలయంగా శాతవాహనకు గుర్తింపు
● వీసీ ఉమేశ్‌కుమార్
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2008లో స్థాపించబడి ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యాలయంగా గుర్తించబడుతుందని వీ సీ ఉమేశ్‌కుమార్ ఉన్నారు. యూనివర్సిటీ గురించి ప్రపంచానికి తెలిసేలా తన పర్యటన కొనసాగింద ని వివరించారు. ఆగస్టు 17 నుంచి 31 వరకు అమెరికా పర్యటన వివరాలను బుధవారం వెల్లడించా రు. భిన్న కోర్సులతో నాలుగు పీజీ సెంటర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏ ర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ, పరిశోధన, విద్యారంగంలో మెరుగైన అవకాశాలకు ఎన్‌ఆర్‌ఐ సాయం కోసం అమెరికాలోని 7 ప్రముఖ నగరాల ను సందర్శించి విరాళాలు సేకరించామన్నారు. 8 బంగారు పతకాలతో పాటు రూ.అర కోటికి పైగా విరాళాలు సేకరించినట్లు తెలిపారు. సాంకేతిక అభివృద్ధి కోసం కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు అందజేసేందుకు ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చినట్లు ఆయన తెలిపారు. నవంబర్ రెండోవారంలో విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.