
సింగరేణికి సెక్యూరిటీ బెంగ
తగ్గుతున్న పర్మినెంట్, పెరుగుతున్న కాంట్రాక్టు సిబ్బంది భూగర్భ గనులను లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఆస్తుల పరిరక్షణపై అధికారుల ఆందోళన గార్డులుగా మహిళా కార్మికులు?
గోదావరిఖని: సింగరేణి ఆస్తులను కంటికి రెప్పలా కాపాడాల్సి సెక్యూరిటీ విభాగం ప్రైవేట్ వ్యవస్థల చేతుల్లోకి వెళ్తోంది. లాభాల పేరిట వాస్తవాలను వి స్మరిస్తూ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య పెంచుతూ, పర్మినెంట్ గార్డుల సంఖ్య తగ్గిస్తున్నారు. త ద్వారా ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వాస్తవం ఇలా..
వాస్తవానికి అవుట్‌సోర్సింగ్ ప్రారంభించిన సమయంలో 70 శాతం పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది, 30 శాతం కాంట్రాక్ట్ సిబ్బంది ఉండాలని నిర్ణయించారు. ఈ నిబంధనను ఇప్పుడు పూర్తి విస్మరించారు. సింగరేణిలో ప్రస్తుతం 60 శాతం కాంట్రాక్టు కార్మికులు, 40 శాతం పర్మినెంట్ కార్మికులు ఉన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది వ్యవస్థ కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందంటున్నారు.
పర్మినెంట్ సిబ్బందిని తగ్గిస్తూ..
సింగరేణి పర్మినెంట్ కార్మికుల సంఖ్య తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం సంస్థలో 935మంది పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటే, 1,367మంది కాంట్రా క్టు సిబ్బంది ఉన్నారు. వీరితోపాటు ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్‌వైజర్లు 28మంది ఉన్నారు. ఫలితంగా పర్మినెంట్ ఉద్యోగులపై వీరిదే పెత్తనం కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి.
పర్మినెంట్‌తో సంస్థకు రక్షణ..
పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది సింగరేణి ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తారు. ఏదైనా తప్పుచే సినా, అక్రమాలు చోటుచేసుకున్నా.. చార్జిషీట్ ఇవ్వడం, విచారణ జరపడం, మరీ ఎక్కువైతే విజిలెన్స్ విచారణ ఉంటుంది. కాంట్రాక్టు(అవుట్‌సోర్సింగ్) సిబ్బంది తప్పుచేస్తే ఉద్యోగంలోంచి తీసివేయడం తప్ప పెద్దగా జరిగేది ఏమీ ఉండదు. కొంతకాలంగా చోరీలు చోటుచేసుకోవడం ఈకోవలోనే ఉంటున్నాయని కార్మిక నాయకులు అంటున్నారు.
యువ కార్మికులకు అవకాశం?
సింగరేణిలో యువకార్మికుల సంఖ్య భారీగా పెరిగింది. ఖాళీలను బట్టి వీరిని సెక్యూరిటీ వింగ్‌లో నియమించాలనే డిమాండ్ వస్తోంది. ఈవిషయంలో సీఎండీ దృష్టి సారించాలని పలు కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
సింగరేణిలో మహిళా సెక్యూరిటీ ఉద్యోగాలు?
సింగరేణిలో మహిళా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో వారిని కూడా సెక్యూరిటీ విభాగంలో నియమించాలనే యోచనలో సింగరేణి ఉందని చెబుతున్నారు. త్వరలోనే సుమారు 150 మంది మహిళా సెక్యూరిటీ గార్డులుగా పర్మినెంట్ ఉద్యోగులుగా నియమించే అవకాశం ఉంది.
భూగర్భ గనుల్లోకి దొంగలు..
భూ గర్భగనుల్లోకి కూడా దొంగలు చొరబడడం సంచలనంగా మారింది. ఓసీపీ క్వారీలోకి వెళ్లి కాపర్ కేబుల్ ఎత్తుకెళ్తున్న దొంగలు.. తాజాగా ప్రమాదకరమైన భూగర్భ గనిలో చోరీ చేసేందుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఖాళీల సమాచారం
హోదా మంజూరైన ఉన్నవి పోస్టులు
సీనియర్ ఇన్‌స్పెక్టర్ 14 4
జూనియర్ ఇన్‌స్పెక్టర్ 16 13
జూనియర్ అసిస్టెంట్ 15 10
జమేదార్లు 76 65
సెక్యూరిటీ గార్డులు 1,038 935
ఏరియా పర్మినెంట్ కాంట్రాక్టు
కార్పొరేట్ 73 75
హైదరాబాద్ 15 –
కొత్తగూడెం 66 204
ఇల్లెందు 67 70
మణుగూరు 28 127
ఆర్జీ–1 112 111
ఆర్జీ–2 77 94
ఆర్జీ–3 127 118
భూపాలపల్లి 64 116
శ్రీరాంపూర్ 157 138
మందమర్రి 106 147
బెల్లంపల్లి 29 119
ఎస్టీపీపీ 03 54
విజిలెన్స్ 10 –
మొత్తం 935 1,367
ఏరియాల వారీగా సెక్యూరిటీ సిబ్బంది
సెక్యూరిటీ సిబ్బంది సమాచారం
పర్మినెంట్
935
ప్రైవేట్
1,367
సీఐఎస్‌ఎఫ్
406

సింగరేణికి సెక్యూరిటీ బెంగ