ఇళ్ల నిర్మాణం వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణం వేగవంతం

Sep 10 2025 10:20 AM | Updated on Sep 10 2025 10:20 AM

ఇళ్ల

ఇళ్ల నిర్మాణం వేగవంతం

ఇళ్ల నిర్మాణం వేగవంతం ధర్మారం(ధర్మపురి): జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. పత్తిపాక, మల్లాపూర్‌,బంజేరుపల్లి, లంబాడిపల్లి, ధర్మారంలో మంగళవారం పర్యటించారు. అధికారులకు సూచనలు చేశారు. ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌, ఎంపీవో రమేశ్‌, ఏఈ రాజశేఖర్‌ పాల్గొన్నారు. ఉత్తమ ర్యాంక్‌ సాధించాలి కోల్‌సిటీ(రామగుండం): నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌–2025లో ఉత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేయాలని కమిషనర్‌ అరుణశ్రీ సూచించారు. బల్దియా కార్యాలయంలో మంగళవారం స్వచ్ఛ సర్వేక్షణ్‌–2025పై వర్క్‌షాప్‌ నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ, ర్యాంక్‌కు అవసరమై న ఎఫ్‌ఎస్‌టీపీ, డీఆర్‌సీసీ, కంపోస్ట్‌, డంపింగ్‌ యార్డ్‌, ఓడీఎఫ్‌ ప్లస్‌ప్లస్‌ ధ్రువీకరణపత్రంతోపాటు యంత్రాలు, మౌలిక వసతుల ఉన్నాయ న్నారు. తడి, పొడిచెత్తను ఇళ్ల వద్దే రీసైక్లింగ్‌ చే స్తే అధిక మార్కులు వస్తాయని, దీనిదృష్ట్యా సి బ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచించా రు. ఎకో వారియర్స్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు శి వకృష్ణ, కరుణాకర్‌, మహేంద్ర ప్రతినిధులు ప వర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో స్వచ్ఛ సర్వేక్షణ్‌–2025 మార్గదర్శకాలు వివరించారు. కార్య క్రమంలో డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, మెప్మా టీఎంసీ రజని పాల్గొన్నారు. వ్యాధులపై అప్రమత్తం పెద్దపల్లిరూరల్‌: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి శ్రీవాణి సూచించారు. ఆశ నోడల్‌ సూపర్‌వైజ ర్లతో కలెక్టరేట్‌లో ఆమె మంగళవారం సమావేశమయ్యారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నే ప్రసూతి అయ్యేలా ప్రోత్సహించాలని సూ చించారు. రాఘవాపూర్‌ పీహెచ్‌సీ పరిధిలో జ రిగిన మాతృమరణంపై ఆరా తీశారు. మాతృమరణాల నియంత్రణకు ఎర్లీ రిజిస్ట్రేషన్‌, ఏఎన్‌సి పరీక్షలు, బర్త్‌ ప్లానింగ్‌, హైరిస్క్‌ గర్భిణిల గుర్తింపు, నాణ్యమైన వైద్యం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రో గ్రాం అధికారులు శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌, దయామణి సదానందం, స్రవంతి, భవాని, మమత, జమున ఉన్నారు. ఆటల్లోనూ రాణించాలి పెద్దపల్లిరూరల్‌: విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని డీఈవో మాధవి సూ చించారు. స్థానిక క్రీసెంట్‌ హైస్కూల్‌ (సుభా ష్‌నగర్‌)లో మంగళవారం జోనల్‌స్థాయి ఎస్జీఎ ఫ్‌ క్రీడా పోటీలను డీఈవో ప్రారంభించి మా ట్లాడారు. గ్రామస్థాయి విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయి స్థాయిలో రాణిస్తున్నారని అన్నా రు. కార్యక్రమంలో ఎంఈవో సురేందర్‌కుమా ర్‌, డీవైఎస్‌వో సురేశ్‌, ఎస్జీఎఫ్‌ కార్యదర్శి ల క్ష్మణ్‌, పీఈటీ సు రేందర్‌, శోభ, శైలజ, కుమారస్వామి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

సంకీర్తనకు ఎల్‌వోసీ చెక్కు

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): ఆ రెపల్లె గ్రామాని కి చెందిన వి ద్యార్థిని కాంటాల సంకీర్తన వైద్య చికిత్సల కోసం ఎమ్మెల్యే విజయరమ ణారావు మంగళవారం రూ. 2.50 లక్షల ఎ ల్‌వోసీ చెక్కు అందజేశారు. ‘అంతుచిక్కని వ్యాధి.. అస్వస్థతలో విద్యార్థిని’ శీర్షికన గతనెల 23న ‘సాక్షి’ కథ నం ప్రచురించింది. కాంగ్రెస్‌ మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్‌ ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎ మ్మెల్యే చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్‌వోసీ చెక్కు మంజూరైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చెక్కు అందజేశారు. ఎమ్మెల్యే, సారయ్యగౌడ్‌, రావి సదానందం, ‘సాక్షి’కి సంకీర్తన తల్లిదండ్రులు లావణ్య – వీరన్న కృతజ్ఞతలు తెలిపారు.

ఇళ్ల నిర్మాణం వేగవంతం 
1
1/5

ఇళ్ల నిర్మాణం వేగవంతం

ఇళ్ల నిర్మాణం వేగవంతం 
2
2/5

ఇళ్ల నిర్మాణం వేగవంతం

ఇళ్ల నిర్మాణం వేగవంతం 
3
3/5

ఇళ్ల నిర్మాణం వేగవంతం

ఇళ్ల నిర్మాణం వేగవంతం 
4
4/5

ఇళ్ల నిర్మాణం వేగవంతం

ఇళ్ల నిర్మాణం వేగవంతం 
5
5/5

ఇళ్ల నిర్మాణం వేగవంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement