
సమన్వయంతో ఫ్యామిలీ కౌన్సెలింగ్
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం
పెద్దపల్లిరూరల్: సఖి కేంద్రాలకు వచ్చే గృహహింస, మహిళల రక్షణ, పోక్సో కేసుల్లో చేపట్టే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ను మహిళా ఠాణా, సఖి కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. మంగళవారం వివిధ అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. ప్రతీ కేసును ఆరునెలల దాకా ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. భరోసా సెంటర్‌కు వచ్చే పోక్సో కేసుల్లో బాలికలకు రక్షణ కల్పించాల పేర్కొన్నారు.
‘సే నో టు డ్రగ్స్’ పోస్టర్ ఆవిష్కరణ
సెంటినరీకాలనీకి చెందిన మహిపాల్‌రెడ్డి లడఖ్ ప్రాంతంలోని ఎత్తయిన శిఖరం మౌంట్ కియాగర్ రి (6,100మీ., 20,026 అడుగులు) పర్వతాన్ని అధిరోహించేందుకు నిర్ణయించారు. దానిపై ప్రదర్శించే సే నో టు డ్రగ్స్ త్రివర్ణపతాకంతో కూడిన బ్యానర్ ప్రదర్శిస్తారు. ఈ పోస్టర్‌ను డీఎంవో ప్రవీణ్‌రెడ్డితో కలిసి కలెక్టర్ శ్రీహర్ష కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. అదేవిధంగా ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఇందులో సాత్విక్, షానాజ్, అనుపమ ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి వేణుగోపాల్, ఏసీపీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.