
యూరియా కొరతపై బీఆర్‌ఎస్ నిరసన
● కాల్వశ్రీరాంపూర్, ఓదెలలో ధర్నా
కాల్వశ్రీరాంపూర్/ఓదెల(పెద్దపల్లి): జిల్లాలో యూ రియా కొరతను నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు మంగళవారం కాల్వశ్రీరాంపూర్‌లో ధర్నా చేశారు. ఓదె ల మండల కేంద్రంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, రైతులకు సరిపడా యూరియా తెప్పిండంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వానాకాలం పంటలకు సరిపడా ని ల్వలు తెప్పించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తా మని ఆయన హెచ్చరించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతింపజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాల్లో నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు కొట్టె సుజాత, నూనేటి సంపత్ యాదవ్, వంగళ తిరుపతిరెడ్డి, నాగార్జున్‌రావు, సదానందంగౌడ్, దొమ్మటి సీను, బండ రవీందర్‌రెడ్డి, బైరం రమేశ్, శ్రీదేవి, శ్యాం, తీగల స్వప్న, జక్కె రవీందర్‌గౌడ్, కొంకటి మల్లారెడ్డి, మిట్టపెల్లి కొమురయ్య, ఐరెడ్డి వెంకటరెడ్డి, గంట రాములుయాదవ్, గట్టు రమాదేవి, కుమార్, శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.