
కేసీఆరే ప్రాజెక్టులు పూర్తిచేశారు
మంథని: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో సీఎం రేవంత్‌రెడ్డి దూషించడం తప్ప ఒక్కమంచి మాట మాట్లాడలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. స్థానిక రాజగృహలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎ ల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది శ్రీపాదరావు అని, కాళేశ్వ రం ప్రాజెక్టు కూలిపోయిందంటూ మాట్లాడారని, అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టుపై సీఎంకు పూర్తిగా అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. 2004లో ఎల్లంపల్లి పనులు ప్రారంభిస్తే 2016లో అప్పటి సీఎం కేసీఆర్ పూర్తిచేశారని గుర్తుచేశారు.