
రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సుల్తానాబాద్(పెద్దపల్లి): రైతులను గోసపెడుతున్న ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించక తప్ప దని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. యూరియా కొరత తీర్చాలనే డిమాండ్ తో స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట రైతులతో క లిసి ధర్నా చేశారు. కొందరు బీఆర్‌ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ రాకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. దాసరి మాట్లాడుతూ, రైతులకు సరిపడా యూరియా అందించకుంటే అధికారులు, నాయకులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామన్నారు. జూపల్లి సందీప్‌రావు, సూర శ్యా మ్, గుణపతి, భూమేశ్, రాజమల్లు, వంగల తిరుపతిరెడ్డి, గంట రాములు, మనోజ్‌గౌడ్, రమణ, చంద్రమౌళి, మహేశ్‌యాదవ్, గోపి పాల్గొన్నారు.