
రోడ్డుపై గొయ్యి.. జరభద్రం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని వన్‌టౌ న్ పోలీస్ సమీపంలోని సాక్రెడ్ హార్ట్ హైస్కూల్ ఎదుట ప్రధాన రహదారి గుంతలమయమైంది. పూర్తిగా అధ్వానంగా మారి రాకపోకలకు వాహనదారులు, ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దగుంతలు ఏర్పడడంతో తరచూ రోడ్డు ప్రమాదాలూ చోటుచేసుకుంటున్నాయి. అయినా, అధికారులెవరూ దీనిపై దృష్టి సారించడంలేదు. స్థానికులే రోడ్డుపై కర్రపాతి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ ప్రధాన రహదారిపై అటు రామగుండం బల్దియా అధికారులు, ఇటు సింగరేణి యాజమాన్యం దృష్టి సారించకపోవడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకముందే చర్య లు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.