
ప్రభుత్వ యంత్రాంగం ఆరా
సాక్షి, పెద్దపల్లి: ‘పనికో రే టు.. ఊరురికో ఏజెంట్’ శీర్షి కన ‘సాక్షి’లో శనివారం ప్ర చురితమైన కథనం జిల్లాలో చర్చనీయాంశమైంది. లంచం ఇవ్వనిదే పనులు చేయరనే అపవాదు ఎదుర్కొంటు న్న ఆ అధికారి ఎవరనే విషయమై యంత్రాంగంతోపాటు ఇంటలిజెన్స్ అధికారులు శనివా రం ఆరా తీశారు. సదరు మండలానికి సంబంధించిన కొందరు మాజీ ప్రజాప్రతినిధులను సంప్రదించి సదరు అధికార వ్యవహారశైలిపై వి వరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. ఒకట్రెండురోజుల్లో ఆ అధికారితోపాటు సహకరిస్తున్న కలెక్టరేట్‌లోని ఓ అధికారిపైనా చర్యలకు ఉన్నతాధికారులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.
8న ఉపాధ్యాయులకు సన్మానం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయలుగా ఎంపికైన 48 మందిని సోమవారం (ఈనెల 8న) సత్కరించనున్నట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. జాతీయ ఉపాధ్యా య దినోత్సవం సందర్భంగా జిల్లా పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయు ల జాబితా సిద్ధం చేశామన్నారు. వీరు ఈనెల 8న మధ్యాహ్నం 3గంటలకు కలెక్టరేట్‌కు హాజరు కావాలని డీఈవో కోరారు.
ప్రాదేశిక ఎన్నికలకు సిద్ధం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): జెడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నామని జెడ్పీ సీఈవో నరేందర్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై అధికారులతో శనివారం సమీక్షించారు. ఎన్ని కల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎంపీడీవో పూర్ణచందర్‌రావు, ఎంపీవో ఆరిఫ్‌హుస్సేన్, సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ రవి, జూనియర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి, టైపిస్ట్ లక్ష్మణ్, జెడ్పీ సూపరింటెండెంట్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
రేపు అప్రెంటిస్‌షిప్ మేళా
పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో సోమవారం అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లోఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మిషినిస్ట్, డీజిల్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రా నిక్స్, మెకానిక్, కోపా ట్రేడ్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10.30 గంటల వరకు తమ పేర్లను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలతో నేరుగా హాజరు కావాలని ఆయన కోరారు.
పింఛన్ పెంపు కోసం పోరాటం
పెద్దపల్లిరూరల్: దివ్యాంగుల పింఛన్ పెంపు కోసం పోరాటం చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగ హక్కుల పోరాట సమితి నాయకుడు మంద కృష్ణమాదిగ అన్నా రు. జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి కాంగ్రెస్ నాయకుడు శ్యాంతో కలిసి పలువురు నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పోరాటం సాగిస్తామని ఆయన అన్నారు.
ప్రభుత్వ భూమిలో బోర్డు
ముత్తారం(మంథని): ఖమ్మంపల్లి గ్రామ శివారులోని 617 సర్వే నంబరు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటయని తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి శనివారం హెచ్చరించారు. ఆ భూమిని కబ్జా కొందరు చేస్తున్నారనే స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టా ధ్రువీకరణపత్రాలు లేకుండా ఆ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వ యంత్రాంగం ఆరా

ప్రభుత్వ యంత్రాంగం ఆరా

ప్రభుత్వ యంత్రాంగం ఆరా