
డ్రగ్స్ బాధితులకు పారా లీగల్ క్లినిక్ అండ
కోల్‌సిటీ(రామగుండం): డ్రగ్స్ బాధితులకు అండగా నిలిచి, న్యాయ సేవలు అందించేందుకు పా రా లీగల్ క్లినిక్ దోహదపడుతుందని గోదావరిఖ ని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో శనివారం ఏర్పాటు చే సిన పారా లీగల్ క్లినిక్‌ను జడ్జి ప్రారంభించి మా ట్లాడారు. డ్రగ్స్‌తో విలువైన జీవితాన్ని కోల్పోతున్నారన్నారు. బాధితుల్లో పరివర్తన తీసుకురావడానికి, న్యాయ సేవలు అందించేందుకు జాతీ య న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మ త్తు పదార్థాల నివారణ అవగాహన కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో పారా లీ గల్ న్యాయవాదితోపాటు వలంటీర్లు ప్రతీశనివా రం అందుబాటులో ఉంటారని తెలిపారు. బాధితుల హక్కులు, న్యాయ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సీనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి, ఆ స్పత్రి సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, డాక్టర్ అప్పారావు, పారాలీగల్ న్యాయవాది ముక్కెర అంజలి, పారా వలంటీర్ బానమ్మ, న్యాయవా దులు ముచ్చకుర్తి కుమార్, శిరీష పాల్గొన్నారు.