
విద్యార్థులతోనే దేశభవిష్యత్
గోదావరిఖనిటౌన్: విద్యార్థులు దేశభవిష్యత్‌కు దిక్సూచిలాంటి వారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. యువత ఉ న్నత విద్య అభ్యసించి రాజకీయాల్లో చేరి దేశ సే వలో పాలుపంచుకోవాలన్నారు. స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో చేపట్టిన ఎన్‌ఎస్‌ఎస్ మె గా ప్రత్యేక శిబిరం ముగింపు సమావేశం శనివా రం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి లక్ష్యం నెరవేర్చుకోవాలని సూచించారు. శాతవాహన యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి నాయకులు మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, వైస్ ప్రిన్సిపాల్ ఎ.సాంబశివరావు, ఎన్‌ఎస్‌ఎస్ నోడల్ ఆఫీసర్ ప్రసాద్‌బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు ఎం.నరేశ్, కిరణ్మయి, దామరకొండ శంకర్, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.