
నైపుణ్యానికి గుర్తింపు..సేవలకు సలాం
గోదావరిఖనిటౌన్/మంథని: నైపుణ్యానికి గుర్తింపు లభించింది. సేవలకు ప్రశంస దక్కింది. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్ పల్లెర్ల శంకరయ్య, మంథని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మ్యాథ్స్ టీచర్ గీట్ల భరత్‌రెడ్డికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన శంకరయ్య విద్యార్థులలో విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం..వినూత్న రీతిలో పాఠలు బోధిస్తారు. 2019లో జిల్లా, 2020లో వర్సిటీ స్థాయిలో ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. 2021లో రాష్ట్రస్థాయి బెస్ట్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం అధికారిగా అవార్డు సొంతంచేసుకున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, పౌర సమాచార హక్కు అధికారిగా, స్టూడెంట్ కెరీర్ గైడెన్స్ అధికారిగా సేవలందించారు. మంథనికి చెందిన గీట్ల భరత్‌రెడ్డికి 2018లో జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు దక్కింది. మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్న ఈయన విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభ వెలికితీసేందుకు కృషిచేశారు. చదువుపట్ల శ్రద్ధ పెంచేలా చర్యలు తీసుకున్నారు.

నైపుణ్యానికి గుర్తింపు..సేవలకు సలాం