మావోల తల్లి మృతి | - | Sakshi
Sakshi News home page

మావోల తల్లి మృతి

Sep 5 2025 5:02 AM | Updated on Sep 5 2025 5:02 AM

మావోల

మావోల తల్లి మృతి

మావోల తల్లి మృతి చెరువులో స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతు

హుజూరాబాద్‌: మావోయిస్టులు గోపగాని ఐలన్న, కుమరస్వామి తల్లి గోపగాని కొమరమ్మ(92)మండలంలోని తుమ్మన్నపల్లి గ్రామంలో గురువారం ఉదయం మృతి చెందారు. కొమరమ్మకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. గోపగాని బలన్న, గోపగాని కుమరస్వామి నాటి పీపుల్స్‌వార్‌ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కుమారస్వామి 1979లో కమలాపూర్‌ మండలం గూడూరులో ఏర్పడిన తొలిదళంలో సభ్యుడిగా చేరాడు. దళంలో పనిచేస్తున్న సమయంలోనే గ్రానైట్‌ ప్రమాదంలో మృతి చెందాడు. ఐలన్న పీపుల్స్‌ వార్‌ పార్టీకి ఉత్తర తెలంగాణ రీజనల్‌ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కిడ్నాప్‌నకు గురై 37 ఏళ్లు దాటినా ఆచూకీ లభించలేదు. కుమారుడి ఆచూకీకి ఎదురుచూసిన తల్లికి చివరికి నిరాశే మిగిలి మృతి చెందింది.

బావిలో పడి వృద్ధురాలు..

తిమ్మాపూర్‌: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు మృతిచెందింది. తిమ్మాపూర్‌ మండలం ఇందిరానగర్‌ కు చెందిన అల్వాల లచ్చమ్మ (80) గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. సాయంత్రం గ్రామంలోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో మృతిచెంది కనిపించింది. విషయాన్ని స్థానికులు ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు లచ్చమ్మగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

కాల్వశ్రీరాంపూర్‌: అంత్యక్రియలకు వెళ్లి చెరువులో స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండలంలోని పందిల్లకు చెందిన దబ్బెట రాధ కరీంనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు చేశారు. అనంతరం చెరువులో స్నానానికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన దబ్బెట అనిల్‌(31) ఈత కొడుతూ గల్లంతయ్యాడు. స్థానిక మత్స్యకారులు గాలించినా ఫలితం లేదు. ఎస్సై వెంకటేశ్‌ పెద్దపల్లి నుంచి గజఈతగాళ్లను రప్పించి రాత్రిపూట సైతం గాలింపు చర్యలు చేపట్టినా అనిల్‌ ఆచూకీ లభించలేదు. మృతుడికి భార్య ఉమ, కూతుర్లు అన్విత, వినూత్న, తండ్రి రాజయ్య ఉన్నారు. అనిల్‌ గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులు

జూలపల్లి: మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్‌కుమార్‌ తెలిపారు. మండలానికి చెందిన మానసిక వికలాంగురాలిపై కొప్పుల మహేందర్‌గత నెల 30న మధ్యాన్నం 2 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

మావోల తల్లి మృతి1
1/2

మావోల తల్లి మృతి

మావోల తల్లి మృతి2
2/2

మావోల తల్లి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement