కలహాల కమలం | - | Sakshi
Sakshi News home page

కలహాల కమలం

Aug 6 2025 7:45 AM | Updated on Aug 6 2025 7:45 AM

కలహాల

కలహాల కమలం

● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలో భగ్గుమన్న విభేదాలు ● పదవులు, పెత్తనం కోసం బాహాబాహీ ● స్థానిక ఎన్నికల వేళ వర్గపోరుతో కార్యకర్తల్లో నైరాశ్యం

గాడిన పడేదెలా?

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి గణనీయంగా ఓట్లు వచ్చి రెండోస్థానంలో నిలిచారు. ఇటీవల జరిగిన టీచర్స్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో బీఆర్‌ఎస్‌కు ధీటుగా, కాంగ్రెస్‌ను గద్దె దించి, వచ్చే ఎన్ని కల్లో అధికారంలోకి వస్తామని రాష్ట్రస్థాయి నేతలు తరచూ చెబుతున్నారు. కానీ, జిల్లాలో గ్రూప్‌ రాజకీయాలతో పార్టీ బలహీనపడుతోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టెముక్కల సురేశ్‌రెడ్డి ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, తాజాగా బీఆర్‌ఎస్‌ నుంచి నల్ల మనోహర్‌రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే గ్రూప్‌లుగా మారిన పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ నేతలు.. పదవులు, పెత్తనం కోసం పోటీపడుతున్నారు తప్ప పార్టీ పటిష్టత కోసం శ్రమించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంథని, రామగుండంలో సైతం పాత, కొత్త నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనతోనైనా పార్టీ గాడినపడుతుందని ఆశించిన కార్యకర్తలకు.. ఇరువర్గాల మధ్య విభే దాలు మరింత రచ్చకెక్కడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికై రాష్ట్ర నాయకత్వం అందరినీ పిలిపించుకుని, గ్రూప్‌ రాజకీయాలకు తావులేకుండా పార్టీని గాడిన పెట్టేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. తద్వా రా వచ్చే స్థానిక సంస్థల్లో.. గత ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా సాధించిన విజయాన్ని కొనసాగించవచ్చని అంటున్నారు.

సాక్షి పెద్దపల్లి:

బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కానీ జిల్లా కమలం పార్టీలో అందుకు భిన్న సంస్కృతి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎదుటే నేతల పోటాపోటీ నినాదాలు, నిరసనల తీరుతో అగ్రనాయకత్వం విస్తుపోయేలా గూపు రాజకీయం రచ్చ తారస్థాయికి చేరింది. సాధారణంగా ప్రతీఅంశాన్ని అంతర్గతంగా చర్చించుకునే కమల దళంలో నాయ కు లు బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం పార్టీకి నష్టదాయకంగా మారుతున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో పార్టీకి సానుకూల స్పందన ఉన్నా.. దానిని ఓట్లరూపంలో మార్చుకోవాల్సిన నేతలు.. బహిరంగంగా కామెంట్లు చేసుకోవడం.. అంతర్గతంగా ఫిర్యాదు చేసుకోవడం ఎక్కువై కమల శిబిరంలో ఏంజరుగుతుందో కేడర్‌కు అంతుచిక్కడం లేదు. వెరిసి జిల్లాలో పార్టీ బలహీనపడేందుకు దారితీస్తుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా లీడర్‌ బండెక్కనిదే ఇంచు కదలదు..

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు జిల్లాకేంద్రంలో బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఇ టీవల నియమితులైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పె ద్దపల్లి కమాన్‌ వద్ద నిర్వహించిన ర్యాలీలో కాన్వా య్‌పై ఉన్న అధ్యక్షుడికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు పూలదండ వేయగా, మా నేత, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డిని బండిపైకి ఆహ్వానించరా? అని గుజ్జుల వర్గీయులు ప్రచార రథానికి అడ్డుగా నిల్చొని ఘర్షణకు దిగారు. దుగ్యాల ప్రదీప్‌రావు దిగిపోవాలని గుజ్జుల వర్గీయులు ఆందోళన చేశారు. దీంతో ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. పోలీసుల జోక్యం, నేతలు సర్థిచెప్పడంతో గొడవ సద్దుమనిగింది.

జిల్లా అధ్యక్షుడు డౌన్‌ డౌన్‌ అంటూ..

తీరా వేదికపైకి వెళ్లాక ఇరువర్గాల నేతల అనుచరులు స్టేజీ ఎదుట ఇరువైపులా నిల్చొన్నారు. సభకు అంతరాయం కలిగించేలా ఎవరికి వారు నినాదాలు చేశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. పార్టీ చీఫ్‌ రాంచందర్‌రావు వేదికపై ఉండగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ్‌రెడ్డి మాట్లాడుతుండగా వేదిక ఎదుట నిల్చున్న కార్యకర్తలు.. ‘జిల్లా అధ్యక్షుడు డౌన్‌ డౌన్‌’ అని పెద్దఎత్తున నినాదాలు చేయడం సంచలనంగా మారింది. వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్యే గుజ్జుల పరోక్షంగా దుగ్యాల వర్గంపై మాటలు సంధించారు. తర్వాత మాట్లాడిన దుగ్యాల ప్రదీప్‌రావు సైతం ‘చేసేది చెప్పాలి.. చెప్పేదే చేయాలని’ చురకలు అంటించారు. జిల్లా అధ్యక్షుడు కలుగజేసుకుని నియోజకవర్గంలో గ్రూప్‌లు లేవని కార్యకర్తలకు తెలియజేసేలా గుజ్జుల, దుగ్యాలను పరస్పరం చేతులు కలిపి సర్థిచెప్పాలని రాష్ట్ర అధ్యక్షుడిని వేదికపై నుంచి కోరడం జిల్లాలో గ్రూప్‌ రాజకీయాలు ఏస్థాయిలో ఉన్నా యో తెలియజేస్తోంది. మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన బీజేపీలో స్టేజీపైనే పోలీసులను పెట్టుకొని ప్రశాంతంగా సమావేశం నిర్వహించుకోవాల్సిన పరిస్థితి తలెత్త డం ఎంతవరకు సమంజసమని గ్రూప్‌ రాజకీయాలతో పార్టీకి జరుగుతున్న నష్టం గురించి తెలియజేశారు. పైకి నాయకులంతా కలిసి కట్టుగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. వాళ్ల మధ్య పూడ్చలేనంత గ్యాప్‌ ఉందన్నది పార్టీలో వరుసుగా చోటుచేసుకుంటున్న ఘటనలతో తేటతెల్లమవుతోందని సామా న్య కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

కలహాల కమలం1
1/2

కలహాల కమలం

కలహాల కమలం2
2/2

కలహాల కమలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement