
రైతులకు అందుబాటులో యూరియా
● ఆర్‌ఎఫ్‌సీఎల్ ద్వారా సరఫరా ● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ప్రస్తుతం 2,270 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, బుధవారం (ఈనెల 6న) ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి మరో 3వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే కొనుగోలు చేయాలని, నిల్వ చేసి నష్టపోవద్దని ఆయన సూచించారు. బస్తీదవాఖానాలో షుగర్ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన గ్లుకోమీటర్ పరికరాలను ఇప్పిస్తామన్నారు. పెద్దపల్లి శివారు రంగంపల్లిలోని బస్తీదవాఖానాను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు. ఎన్‌సీడీ బాధితులకు ప్రతినెలా అవసరమైన మందులు అందించాలని, సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గర్రెపల్లి పీహెచ్‌సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీబీపీ మిషిన్‌ను వెంటనే మరమ్మతు చేయిచాలని సూచించారు. డాక్టర్లు రామకృష్ణ, స్వప్న, సింధూజ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
15 వరకు లక్ష్యం పూర్తిచేయాలి
పెద్దపల్లిరూరల్: వన మహోత్సవం లక్ష్యాన్ని ఈనెల 15వ తేదీ వరకు పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని తరచూ పర్యవేక్షించాలని, ఉపాధి పనుల్లో వేగం పెంచాలన్నారు. డీఆర్డీవో కాళిందిని, హౌసిగ్ పీడీ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు.