వైభవంగా ఆదివరాహస్వామి జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఆదివరాహస్వామి జయంతి వేడుకలు

Aug 6 2025 7:45 AM | Updated on Aug 6 2025 7:45 AM

వైభవం

వైభవంగా ఆదివరాహస్వామి జయంతి వేడుకలు

కమాన్‌పూర్‌(మంథని): ప్రముఖ పుణ్యకేత్రం శ్రీఆదివరాహస్వామి జయంతి మంగళవారం ప్రారంభమైంది. అర్చకులు ఉదయం ప్రత్యేకపూజలు చేశారు. బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కాంతరెడ్డి, అర్చకుడు కలకుంట్ల వరప్రసాదచార్యులు తెలిపారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించామని అన్నారు. తహసీల్దార్‌ వాసంతి, ప్రతినిధులు బొల్లపెల్లి శంకర్‌గౌడ్‌, ముస్త్యాల దామోదర్‌, పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

పింఛన్‌ పెంచాలి

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): ఆసరా పింఛన్లు పెంచాలని, కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 13న చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టామని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్‌ తెలిపారు. వికలాంగుల, వితంతువులు, వృద్ధులతో మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్లు పెంచి చెల్లించాలని ఆయన కోరారు. నాయకులు ఏవూరి వెంకటేశ్వర్‌రావు, ఐరెడ్డి నారాయణరెడ్డి, బైరి రామ్మూర్తి, జయ, స్వరూప, మమత, శంకర్‌, రజాక్‌ తదితరులు పాల్గొన్నారు.

రోబోటిక్స్‌పై అవగాహన

గోదావరిఖనిటౌన్‌: జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి, మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు రోబోటిక్స్‌పై స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఒకరోజు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. సోహం అకాడమీ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. గోదావరిఖని, పెద్దపల్లి ప్రిన్సిపాల్స్‌ జైకిషన్‌ ఓజ, ఎంఏ శుకూర్‌ మాట్లాడుతూ, పుస్తకాల్లోని జ్ఞానమేకాకుండా.. దాని వినియోగం, విశ్లేషణ, అ న్వయ సామర్థ్యాల గురించి తెలుసుకోవాలన్నారు. సోహం అకాడమీ శిక్షకుడు సంతోష్‌, టీఎస్‌కేసీ కో ఆర్డినేటర్‌ సుబ్బారావు, మెంటర్‌ ఉషారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

గోదాముల్లో బ్యాలెట్‌ బాక్స్‌లు భద్రం

పెద్దపల్లిరూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సర్వసన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాలెట్‌ పేపర్లు ముద్రించి భద్రపర్చారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్‌ బాక్స్‌లను సైతం సిద్ధం చేశారు. ఈక్రమంలో జిల్లాకు 1,650 బ్యాలెట్‌ బాక్స్‌లు అవసరం కాగా.. గుజరాత్‌ నుంచి తెచ్చేందుకు ఎంపీవో సు దర్శన్‌ తదితరులు అక్కడకు వెళ్లారు. మంగళవారం 1,469 బ్యాలెట్‌ బాక్స్‌లను తీసుకొచ్చారు. వాటిని స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాముల్లో భద్రపర్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు.

11న గెస్ట్‌ టీచర్ల ఇంటర్వ్యూలు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని 11 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు డెమో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ అంజలి మంగళవారం తెలిపారు. జువాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, పీజీటీ మ్యాథ్స్‌, పీజీటీ ఫిజికల్‌ సైన్స్‌, పీజీటీ ఇంగ్లిష్‌, టీజీటీ ఇంగ్లిష్‌ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు, ఉపాధ్యాయులు కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ (ఎల్‌ఎండీ కాలనీ) జ్యోతిబా పూలే పాఠశాలలో ఈనెల 11న ఉదయం 10 గంట వరకు హాజరుకావాలని సూచించారు.

వైభవంగా ఆదివరాహస్వామి జయంతి వేడుకలు1
1/3

వైభవంగా ఆదివరాహస్వామి జయంతి వేడుకలు

వైభవంగా ఆదివరాహస్వామి జయంతి వేడుకలు2
2/3

వైభవంగా ఆదివరాహస్వామి జయంతి వేడుకలు

వైభవంగా ఆదివరాహస్వామి జయంతి వేడుకలు3
3/3

వైభవంగా ఆదివరాహస్వామి జయంతి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement