
జిల్లా అభివృద్ధికి కేంద్రం నిధులు
● రూ.20 కోట్లతో పనులు, ప్రజాసంక్షేమం ● హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్/ధర్మారం: జిల్లాలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల కోసం కేంద్రప్రభుత్వం రూ.20 కోట్లు వెచ్చించిందని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. జి ల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన బీజేపీ జిల్లాస్థాయి పార్టీ శ్రేణుల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. తొలుత సుల్తానాబాద్‌లో ఆయన కు ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత లక్సెట్టిపే టలో జరిగే సభకు వెళ్తూ ధర్మారంలో కాసేపు ఆగా రు. ఆయా ప్రాంతాల్లో పలువురు పార్టీ నేతలు రాంచందర్‌రావుకు ఘనస్వాగతం పలికారు. ఆయా కా ర్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల పేరి ట బీఆర్‌ఎస్ నేతలు రూ.వేల కోట్లు దండుకుంటే.. కాంగ్రెస్ సర్కార్.. అవినీతి పేరిట అధికారులను జైళ్లకు పంపండం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా, బీఆర్‌ఎస్‌కు చెందిన నల్ల మనోహర్‌రెడ్డితోపాటు ఎర్రోళ్ల రాములు, వేల్పుల లక్ష్మీనారాయణ తదితరులు బీజేపీలో చేరారు. ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, నాయకులు కర్రె సంజీవరెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్ర దీ ప్‌కుమార్, వెంకటేశ్‌నేత, మీస అర్జున్‌రావు, కడారి అశోక్‌రావు, సురేశ్‌రెడ్డి, కన్నం అంజయ్య, కామణి రాజేంద్రప్రసాద్, మహేందర్ యాదవ్, కందుల శ్రీ నివాస్, ప్రవీణ్ కుమార్, నాగరాజు యాదవ్, తిరుపతి, నారాయణస్వామి, రంజిత్‌రెడ్డి, రాజు, రాంబాబు, సతీశ్‌రెడ్డి, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి ఉన్నారు.