
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పెద్దపల్లిరూరల్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు శ్యాం డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు. ప్రతీపాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని అన్నారు. సమ్మె కాలపు వేతనం చెల్లించాలని కోరారు. నాయకులు కుమారస్వా మి, పోచయ్య, రాంకిషన్‌రావు, లక్ష్మణ్, సంతోష్ రెడ్డి, పర్శరాములు, శంషొద్దీన్, కిరణ్, కొముర య్య, రాజు, ప్రకాశ్‌రావు, జనార్దన్, రాజ్‌కుమా ర్, వెంకటేశ్వర్‌రెడ్డి, వసుంధర, పద్మావతి, వాసవి, స్వప్న, ప్రతాప్‌చారి తదితరులు ఉన్నారు.