
సాగు అంతంతే..
● పది మండలాల్లో లోటువర్షపాతం ● జిల్లాలో సాధారణం కన్నా తక్కువ నమోదు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో చేరని నీరు ● కుంటలు, చెరువులదీ అదేపరిస్థితి ● ఆందోళనలో అన్నదాతలు
సాక్షి పెద్దపల్లి: ‘వానమ్మ.. వానమ్మ.. ఒక్కసారన్నా వచ్చిపోవే’ అంటూ జిల్లా రైతాంగం వర్షాల కోసం ఎంతోఆశతో ఎదురుచూస్తోంది. ఆరంభంలో మురిపించినా ఆ తర్వాత జాడలేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమోదైంది. ఫలితంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిత్యం సెంటీ మీటర్లలో కురవాల్సిన వర్షం.. మి.మీ.లలో కూడా నమోదు కావడంలేదు.
సాగుకు అదను దాటుతోంది..
పంటలు పండించేందుకు అదను దాటుతోంది. ఈ వర్షాకాలం సీజన్‌లో జూన్, జూలైలో పెద్దగా వర్షా లు కురవలేదు. ఆగస్టు మొదటివారం గడుస్తున్నా వానజాడ లేదు. వర్షాలు లేక సాగుబాట పట్టకుండా చాలామంది రైతులు మిన్నకుండిపోయారు. చె రువులు, కుంటల్లో నీరున్న ప్రాంతాల్లో తప్ప ఎక్క డా పెద్దగా సాగులేదు. తొలకరిలో కురిసిన వర్షాలకు విత్తిన మెట్ట పంటలు కూడా ఎండిపోయాయి. ఇటీవల వారంపాటు ముసురు కురవడంతో మెట్ట పంటలు చిగురించాయి. ఆ వానలకు రైతులు కొంత ధైర్యం చేసి సాగుబాట పట్టారు. సాగు పుంజుకుంటున్న ఈ తరుణంలో వరుణుడు మళ్లీ ము ఖం చాటేయగా.. సాగు మళ్లీ డీలా పడిపోయింది.
సగానికి పడిపోయింది..
జిల్లాలో ఈ ఏడాది వర్షాభావంతో అన్నిమండలాల్లో సా గు విస్తీర్ణం సగానికి పడిపోయింది. గతవారంలో కురిసిన వర్షాలకు చెరువు లు, కుంటల్లోకి నీరు వచ్చిన దాఖాలా లు కనిపించ డం లేదు. ఆ రుతడి పంటలకు మాత్రం జీవం పోసినట్లయ్యింది తప్పితే.. సా గు ఊపందుకో లేదు. ఈ సీజన్‌లో 2.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 1.91లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. ఈనెల 15వ తేదీ వరకు వరినాట్లు వేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
10 మండాల్లో లోటు వర్షపాతమే
ఈ వానాకలం సీజన్‌లో ఇప్పటివరకు 479.9 మి.మీ. వర్షాపాతం నమోదుకావాల్సి ఉండగా, 31 మి.మీ. లోటు వర్షపాతంతో 329.9 మి.మీ.గా నమోదైంది. జిల్లాలో 14 మండలాలు ఉండగా.. కేవలం మంథని, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్‌లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 10 మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది.
జూన్ 1 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు నమోదైన వర్షపాతం(మి.మీ.లలో)
జిల్లాలోని చెరువుల్లో నీటినిల్వలు
మొత్తం చెరువులు 1,018
0–25 శాతంలోపు 327
25–50 శాతంలోపు 199
50–75 శాతంలోపు 176
75–100శాతంలోపు 272
మత్తడి పడినవి 44
బోసిపోతున్న చెరువులు, ప్రాజెక్టులు
జిల్లాలో 1,018 చెరువులు ఉండగా 44 చెరువులు మత్తడి పోయగా, 25శాతం కూడా నిండని చెరువులు 327 ఉన్నాయి. మరోపక్క.. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం వచ్చిచేరే వరద తక్కువగానే ఉంది. ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 148 మీటర్లు కాగా ప్రస్తుతం 144 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా 12.32 టీఎంసీలే ఉంది. గతేడాది ఇదేరోజు 15.75 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 435 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. అలాగే అవుట్‌ఫ్లో 435 క్యూసెక్కులుగా ఉంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ స్కీం కోసం 314 క్యూసెక్కులు తరలిస్తుండగా.. ఎన్టీపీసీ అవసరాల కోసం మరో 121 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
2024– 2025లో సాగు ఇలా.. (ఎకరాల్లో)
పంట 2024 2025
వరి 2,10,027 1,43,153
మొక్కజొన్న 705 377
పత్తి 52,670 48,215
కందులు 169 87
కురవాల్సింది 474.9
కురిసింది 329.9
వ్యత్యాసం(శాతంలో) 31
వర్షం కురిసిన రోజులు 24
ఇంకా గడువుంది
వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఈసారి సాగు అంతంతంగానే ఉంది. ఈనెల 15వ తేదీ వరకూ వరి సాగుచేయొచ్చు. రెండు, మూడు భారీవర్షాలు పడితే పంటలకు ఢోకా ఉండదు.
– శ్రీనివాస్, డీఎవో

సాగు అంతంతే..

సాగు అంతంతే..