
మృత్యుంజయ హోమం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పీటీఎస్ ఆలయంలో సోమవారం మహా మృత్యుంజ య హోమం ఘనంగా నిర్వహించారు. అర్చకు లు వామనశర్మ, రుధ్రభట్ల శ్రీకాంత్ తదితరు లు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీపీసీ రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత హాజరయ్యారు. లోక కల్యాణం కోసం హోమం నిర్వహించారు. ఉన్నతాధికారులు, అధికారులు, అధికార సంఘం ప్రతినిధులతోపాటు ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటి వద్దే రీసైక్లింగ్‌తో అనేక ప్రయోజనాలు
కోల్‌సిటీ/ఫెర్టిలైజర్‌సిటీ: ఇంటి వద్దే రీసైక్లింగ్‌తో డంప్ యార్డ్‌కు వెళ్లే చెత్తను తగ్గించడానికి అవకాశం ఉంటుందని రామగుండం బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి అన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టగా, డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించారు. గౌతమినగర్‌లోని డీఆర్‌సీసీతోపాటు కంపోస్ట్‌యార్డ్, మల్కాపూర్ శివారులోని డంపింగ్‌యా ర్డ్‌లను వెంకటస్వామి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ, చెత్తను ఇంటి వద్దనే తడి, పొడిచెత్తగా వేరుచేసి కంపోస్టింగ్ చేయాలన్నారు. అలాగే 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో ఆస్తిపన్ను మదిపు చేయడం, పునఃపరిశీలించడం చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ ఆర్వో ఆంజనేయులు, ఆర్‌ఐలు శంకర్‌రావు, ఖాజా, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, ఆర్పీలు, స్వశక్తి సంఘాల మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కే హక్కు ఉంది
రామగుండం: బ్రాహ్మణపల్లి/ముర్మూర్ ఎత్తిపోతలను ప్రారంభించే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని ఆ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ అన్నారు. అంతర్గాంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎ ల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, దానికి అనుసంధానంగా ఎత్తిపోతల ఉందనే విషయాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు గుర్తించాలని సూచించారు. ఎత్తిపోతలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించడాన్ని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తప్పుపట్టడం శోచీనయమన్నా రు. కాంగ్రెస్ ప్రతినిధులు ఉరిమెట్ల రాజలింగం, గాదె సుధాకర్, గుంట లక్ష్మణ్, కనకయ్య, శ్రీనివాస్‌గౌడ్, అప్పాల రాజేందర్, ఇండిబిల్లి రవి, ఒల్లెపు స్వామి, బాణాల రాములు, జూల లింగయ్య, జలీల్, అక్షయ్ పాల్గొన్నారు.
వార్షిక లాభాలు ప్రకటించాలి
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వార్షిక లాభాలు ప్రకటించి, అందులో కార్మికులకు 30 శాతం వాటా చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, ఎస్‌సీఈయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రధాన చౌరస్తాలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగి నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆరోపించారు. ఈక్రమంలోనే సంస్థ ఆర్థిక పరిస్థితి గురించి కార్మికులకు తెలియజేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని అన్నారు. నాయకులు వైవీ రావు, ఎరవెల్లి ముత్యంరావు, ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, బానోతు వినయ్, కుంట ప్రవీణ్, కొమురయ్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

మృత్యుంజయ హోమం

మృత్యుంజయ హోమం

మృత్యుంజయ హోమం