
వినతులు స్వీకరించి..పరిష్కార మార్గం చూపి..
● ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ వేణు
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకునేందుకే ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అడిషనల్ కలెక్టర్ వేణు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన జిల్లావాసుల నుంచి ఆయన సోమవారం ప్రజావాణి ద్వారా అర్జీలను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత శా ఖల అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా కొందరిని ‘సాక్షి’ పలుకరించగా తమ వేదనను ఇలా వెల్లడించారు..