
సత్తాచాటిన సింబా నార్కోటిక్ డాగ్
● రాష్ట్రస్థాయి డ్యూటీ మీట్‌లో గోల్డ్‌మెడల్
గోదావరిఖని: సింబా నార్కోటిక్ డాగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి బంగారు పతకం సాధించింది. వరంగల్ జిల్లా మామునూరు పీటీసీలో జరిగిన తెలంగాణ రాష్ట్రరెండో పోలీస్ డ్యూటీ మీట్‌లో కాళేశ్వరం జోన్ నుంచి నార్కోటిక్ డాగ్ విభాగంలో సింబా పాల్గొని గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించడంలో సత్తా చాటింది. పోలీసు జాగిలం సింబా, డాగ్ హ్యాండ్లర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం.వేణుగోపాల్‌కృష్ణ గోల్డ్ మెడల్ సాధించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్‌గా ‘సింబా’ ఎంపికై ంది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సింబా, డాగ్ హ్యాండ్లర్ వేణుగోపాలకృష్ణను అభినందించారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్క ర్, కరుణాకర్, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు శ్రీనివాస్, ప్రతాప్, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, సంపత్, మల్లేశం పాల్గొన్నారు.