
నేడు బీజేపీ అధ్యక్షుడి రాక
పెద్దపల్లిరూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లా పర్యటనకు వస్తున్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగే ముఖ్యకార్యకర్తల స మావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ విషయాన్ని వెల్లడించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ వర్గీయులు చిలారపు పర్వతాలు, రాజగోపా ల్ తదితరులు సోమవారం వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమ వివరాలపై చర్చించుకుంటూనే పరస్పర దూషణలకు దిగినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, కొత్త రథసారథితోనైనా అసంతృప్తులకు చెక్‌పెట్టి పార్టీని బలోపేతం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాషాయజెండాలు.. ఫ్లెక్సీలు..
పట్టణంలోని ఏ రోడ్డులో చూసినా కాషాయ జెండా లు, నేతల ఫ్లెక్సీలతో నిండిపోయి కనిపిస్తున్నాయి. కాగా, మొన్నటివరకు బీఆర్‌ఎస్‌లో ఉన్న నల్ల మనో హర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీ సభ్యత్వం పొందేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.