
మెడికల్ బోర్డులో కార్మికులకు అన్యాయం
● టీబీజీకేఎస్ ఇన్‌చార్జి కొప్పుల ఈశ్వర్
గోదావరిఖని: గతనెలలో నిర్వహించిన మెడికల్‌బోర్డులో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనికి నిరసనగా సింగరేణిలో ఉద్యమాలు చేస్తామని టీబీజీకేఎస్ ఇన్‌చార్జి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9 నెలల తర్వాత.. జూలై 30, 31న చేపట్టిన మెడికల్ బోర్డుకు 55 మందిని పిలిస్తే.. అందులో ఐదుగురినే అన్‌ఫిట్ చేయడం అన్యాయమన్నారు. ఇది గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల వైఫల్య మేనని ఆయన విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ వందశాతం మెడికల్ బోర్డులో ఉద్యోగాలివ్వాలని సూచించారని, ఇలా 19వేల మందికి ఉద్యోగాలిచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో కారుణ్య నియామకాలు కనుమరుగైయ్యే పరిస్థితి కనబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధిపత్యమే న డుస్తోందని విమర్శించారు. టీబీజీకేస్ నాయకులను ఇబ్బంది పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ బదిలీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మందమర్రిలో ఎస్‌డీఎల్ యాక్టింగ్ ఆపరేటర్ రాచపల్లి శ్రావణ్‌కుమార్ మరణించడం దురదృష్టకరమన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధూకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు మాదాసు రామమూర్తి, నూనె కొమురయ్య, వడ్డేపల్లి శంకర్, నాగెల్లి సాంబయ్య, వాసర్ల జోసఫ్, సురేందర్‌రెడ్డి, మేడిపల్లి సంపత్, చెల్పూరి సతీశ్, అన్వేష్‌రెడ్డి, చల్లా రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.