
అవయవదానం సామాజిక బాధ్యత
● అదనపు కలెక్టర్ అరుణశ్రీ
కోల్‌సిటీ(రామగుండం): రక్త, నేత్ర, అవయవ, శ రీరదానాలు సామాజిక బాధ్యతని అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. వందరోజుల కార్యాచర ణలో బల్దియా కార్యాలయంలో మెప్మా ఆర్పీలకు అవయదాన దినోత్సవం సందర్భంగా రక్త, నేత్ర, అవయవ, శరీరదానాలపై శనివారం అవగాహన కల్పించారు. ఆర్పీలు ఎస్‌హెచ్‌జీ, ఎస్‌ఎల్‌ఎఫ్ స మావేశాల్లో రక్త, నేత్ర, అవయవ, శరీర దానాల పై అవగాహన కల్పించాలని, తల్లిపాల వారోత్స వాలను విజయవంతం చేయాలని కోరారు. డీ ఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి మాట్లాడుతూ, మరణానంతరం, జీవించి ఉండగా కొన్నిఅవయవాలు దానం చేయొచ్చన్నారు. బిడ్డ పుట్టిన అర్ధగంటలోపు ముర్రుపాలు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సార్వజనిక ఆస్పత్రి ఆర్‌ఎంవో రాజు, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు మా ట్లాడారు. కాగా, భర్త అవయవదానంతో ఎనిమి ది మందికి పునర్జన్మ ఇచ్చిన మెప్మా సీవో శమతకమణి, తండ్రి నేత్ర దానం చేసి ఇద్దరికి చూపు ప్ర సాదించిన బల్దియా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి విజయ్ కుమార్‌ను అదనపు కలెక్టర్, ఫౌండేషన్ ప్రతినిధులు సత్కరించారు. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు రామకష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, మెప్మా టీఎంసీ మౌనిక ఉన్నారు.