
రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు
పెద్దపల్లిరూరల్: రైతు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్రర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తూ అండగా నిలుస్తున్నాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ అన్నారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో శనివారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని 73,400 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.14.68కోట్లను కేంద్ర ప్రభుత్వం జమచేసిందని ఆయన అన్నారు. కేవీకే శాస్త్రవేత్తలు శ్రీనివాస్, వెంకన్న, నవ్య, ఏవో అలివేణి, ఏఈవోలు వినయ్, సువర్చల, పూర్ణచందర్, రచన, కల్పన, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.