
మా భూములు తీసుకుంటే బతికేదెట్లా?
● రత్నాపూర్ గ్రామస్తుల ఆగ్రహం ● ఇండస్ట్రియల్ పార్క్ వద్దని నిరసన
రామగిరి(మంథని): ‘ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పా టు మా గ్రామంలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు..? మా జీవనధారమైన పార్క్ ఏర్పాటు చేయొద్దు’ అని పలువురు రైతులు పేర్కొన్నారు. రత్నాపూర్ గ్రామంలోని మేడిపల్లి శివారులో ఇండ స్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం 203.31 ఎకరాల భూ సేకరణ కోసం శుక్రవారం రత్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాభిప్రా య సేకరణ చేపట్టారు. అభివృద్ధి పేరిట సింగరే ణి సుమారు 400 ఎకరాలు, కృషి విజ్ఞాన కేంద్రం పేరిట 170 ఎకరాలు ఇప్పటికే సేకరించారని, అభివృద్ధి పేరిట ఇప్పుడు మళ్లీ తమ భూములు లాక్కోవడం సమంజసం కాదని అన్నారు. విలు వైన భూములను తాము వదుకోలేమని పేర్కొ న్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న తాము భూ ములు కోల్పోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. అయితే, కొందరు రైతు లు భూములు ఇచ్చేందుకు అంగీకరించి, కుటుంబసభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. మరోవైపు.. తమ భూములు ఇచ్చే ప్రస క్తే లేదని, మళ్లీ తమ ఊరికి రావొద్దని మహిళా రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కాస్త గందరగోళం ఏర్పడింది. అయి తే, నివేదికను కలెక్టర్ అందజేస్తామని మంథని ఆర్డీవో సురేశ్ తెలిపారు. సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్‌రావు, ఎస్సైలు శ్రీనివాస్, దివ్య, ప్రసాద్, నరేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. కరీంనగర్ టీజీ ఐఐసీ జనరల్ మేనేజర్ మహేశ్వర్, తహసీల్దార్ సుమన్, ఇండస్ట్రియల్ మేనేజర్ సురేశ్, గ్రామప్రత్యేకాధికారి శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.