
వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
కోల్‌సిటీ(రామగుండం): పౌరులకు మెరుగైన సే వలు అందేలా క్షేత్రస్థాయిలో పర్యటించాలని రా మగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్‌ఏ) అరుణశ్రీ వార్డు అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వార్డు అధికారులతో నిర్వహించిన సమీక్షలో కమిషనర్ మాట్లాడారు. పౌర సేవలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లను లక్ష్యానికి అనుగుణంగా పెంచాలని కమిషనర్ ఆదేశించారు. మొండిబకాయల వసూళ్లకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందులో మంచి పనితీరు కనబరిస్తే 15వ ఆర్థిక సంఘం పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్ కూడా నగరపాలక సంస్థకు మంజూరయ్యే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఆర్‌వో ఆంజనేయులు, ఆర్‌ఐలు శంకర్‌రావు, ఖాజా, వార్డు అధికారులు పాల్గొన్నారు.
పౌరులకు సేవలు అందించండి
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాలు