
ఆహ్లాదం.. అధ్వానం
పెద్దపల్లి జిల్లాగా మారి సుమారు పదేళ్లు గడించింది.
అయినా, పట్టణ రూపురేఖలు మారడం లేదు. ప్రధానంగా సుందరీ కరణకు ఆమడ దూరంలో ఉండిపోయింది. కొత్త ఉద్యానవనాల మాట దేవుడెరుగు.. ఉన్న పార్క్‌లు నిర్వహణ, పర్యవేక్షణ లోపంతో శిథిలావస్థకు చేరాయి. ఆటవిడుపు కోసం జిల్లా కేంద్రంలో అనేక ఉద్యానవనాలు ఉన్నాయని మున్సిపల్ సిబ్బంది, అధికారులు నిర్వహణ కోసం నిధులు వెచ్చిస్తున్నామని ఖర్చులు చూపుతున్నారని, పార్క్‌ల్లో ఆహ్లాదం ఎక్కడా కనిపించడం లేదని కొందరు మాజీ కౌన్సిలర్లు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చంద్రకాకనగర్ తదితర ప్రాంతాల్లోని పిల్లల పార్క్‌ల దుస్థితి ఇది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి