
ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలి
ధర్మారం(ధర్మపురి): లాభాసాటి దిగుబడి వస్తున్న ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి జగన్మోహన్‌రెడ్డి కోరారు. గురువారం ధర్మారం మండలం పత్తిపాక, చామనపల్లి గ్రామాల్లోని రైతులు గంగం రాజేశ్వర్‌రెడ్డి, వేల్పుల కొమురయ్యకు చెందిన 7 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. . మోతాదుకు మించి మందులు వాడరాదన్నారు. దేశంలో ఆయిల్‌పామ్ పంటకు ఉన్న డిమాండ్ మరే పంటలకు లేదని రైతులు ముందుకు వచ్చి సాగుచేయాలని సూచించారు. ఆయిల్ కంపెనీ సీఈవో కేశు కళ్యాణ్‌కర్, ఫీల్డ్ అధికారి మహేశ్ పాల్గొన్నారు.
వినికిడి పరికరాలు అందజేత
పెద్దపల్లిరూరల్: ఆర్‌బీఎస్‌కే వారి వైద్యపరీక్షల్లో వినికిడి లోపం ఉన్నట్టు గుర్తించిన 10మంది విద్యార్థులకు గురువారం డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి వినికియంత్రాలను అందజేశారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అలీంకో ట్రస్ట్‌వారు పరికరాలు అందించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ముందుగానే తేదీలను ఖ రారు చేసి ఆ షెడ్యూల్ ప్రకారం ఆర్‌బీఎస్‌కే వై ద్యాధికారులు, సిబ్బంది వెళ్లి వారి ఆరోగ్యస్థితిగతులు తెలుసుకుని అవసరమైన సేవలందేలా చూడాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో కచ్చితంగా మునగ, కరివేపాకు చెట్లు పెంచా లని, వాటి ఆకులను వండే కూరలలో వేయాలన్నారు. సదరు ఆకులతో పోషకాలు మెండుగా అందుతాయన్నారు. ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి కిరణ్‌కుమార్ తదితరులున్నారు.
మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి
ఎలిగేడు/ఓదెల: ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. మల్లన్న ఆలయ నూతన పాలకవర్గాన్ని ఎలిగేడు మండలం శివపల్లిలోని తన నివాసంలో సన్మానించి మాట్లాడారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, సభ్యులు జంగం కొమురయ్య, కోదాటి మనోహర్‌రావు, జీలుక రవీందర్, కట్కూరి సమ్మిరెడ్డి, కొండ శ్రీనివాస్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్, నాగపురి రవిగౌడ్, చీకట్ల మొండయ్య, తీర్థాల రాజారాం, వీరనేని రవి, ఉప్పుల శ్రావణ్‌కుమార్, గంటా రమేశ్, సామల యమునను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పాలక వర్గసభ్యులు సేవాభావంతో పనిచేస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
బిల్లుల గోల్‌మాల్‌పై ఆందోళన
ముత్తారం(మంథని): మండలంలోని అడవిశ్రీరాంవూర్ జెడ్పీ పాఠశాలలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం, సదరు బిల్లులు గోల్‌మాల్ అయ్యాయని గురువారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు.. ముత్తారానికి చెందిన చేరాలు గతంలో జెడ్పీ పాఠశాలలో పని చేయగా, రూ.40వేలకు పైగా బిల్లులు ఇవ్వాలని పంచాయతీరాజ్ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చినా, బిల్లులు చెల్లించడంలో హెచ్‌ఎం నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో ఇప్పటికే అమ్మ ఆదర్శ కమిటీ కింద రూ.12లక్షల వరకు నిధులు డ్రా చేశారని ఆరోపించారు. అమ్మ ఆదర్శ కమిటీలో జరిగిన పనులు, నిధుల డ్రా పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై హెచ్‌ఎం ఓదెలును వివరణ కోరగా, గతంలో పని చేసిన చేరాలుకు బిల్లు ఇవ్వాలని పీఆర్ అధికారులు రాసిచ్చిన విషయం వాస్తవమేనని, ప్రస్తుత అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ తన హయాంలో పనులు జరగలేదని, ఒప్పుకోవడం లేదన్నారు. చివరి బిల్లు రాగానే ఇస్తామని పేర్కొన్నారు. ఆందోళన చేసినవారిలో చేరాలు, పింగిలి దేవేందర్‌రెడ్డి, బిరుదు గట్టయ్య, భూపెల్లి మొగిళి, రవి, సది, మధుకర్, స్వామి తదితరులు ఉన్నారు.

ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలి

ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలి