
విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచాలి
పెద్దపల్లిరూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లిలోని శాంతినగర్‌లో గల అంగన్‌వాడీ కేంద్రం, ప్రైమరీస్కూల్‌ను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యాప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు.
హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ ప్రవేశానికి..
హైదరాబాద్‌లోని బేగంపేట, రామంతపూర్ పబ్లిక్‌స్కూల్‌లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 1వ తరగతిలో చేరేందుకు ఎస్సీలకు రెండు సీట్లు కేటాయించారని, ఈనెల10న లాటరీ పద్ధతిన సీట్ల కేటాయి స్తారన్నారు. వివరాలకు కలెక్టరేట్‌లోని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
లక్ష్యాలను పూర్తి చేయాలి
పాలకుర్తి(రామగుండం): జిల్లావ్యాప్తంగా నవంబర్ చివరివరకు టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం పాలకుర్తి మండల పరిధిలోని బసంత్‌నగర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్, రోజువారీ పేషెంట్ల వివరాలు పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ సరళి, డాక్టర్ లక్ష్మీభవాని, సిబ్బంది ఉన్నారు.