
3న ఎత్తిపోతల ప్రారంభం
రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్/బ్రహ్మణపల్లి శివారులో నిర్మించిన ఎత్తిపోతలను ప్రారంభించే విషయంపై ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్ బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలి సి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎత్తిపోతల ద్వా రా పాలకుర్తి, అంతర్గాం మండలాల పరిధిలోని సుమారు 20వేల ఎకరాల ఆయకట్టులో రెండు పంటలకు సాగు నీరు అందుతుందని ఠాకూర్ తెలిపారు. ఆగస్టు 3న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్డీవో గంగయ్య, అంతర్గాం తహసీల్దార్ రవీందర్‌పటేల్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అంతర్గాం ఎస్సై వెంకటస్వామి పాల్గొన్నారు.
విద్యార్థులు ఇష్టంతో చదవాలి
జ్యోతినగర్/ఫెర్టిలైజర్‌సిటీ/పాలకుర్తి: విద్యార్థు లు ఇష్టంతో చదవాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ సూచించారు. సింగరేణి సీఎస్సార్ ద్వారా క్యూ ఆర్ కోడ్ ముద్రించిన బుక్స్‌ను టెన్త్‌క్లాస్ విద్యార్థులకు అందించి మాట్లాడారు. ఆర్జీ–1 జీఎం లలిత్ కుమార్, ఏసీపీ రమేశ్, ఎంఈవో మల్లేశం, హెచ్‌ఎం జయరాజ్ పాల్గొన్నారు. కాగా, గౌతమినగర్‌లోని ఓ స్కూల్‌ను ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రా రంభిచారు. పాలకుర్తి మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం బసంత్‌నగర్‌లోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వర్కర్స్ క్లబ్‌లో నిర్వహించగా, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ హాజరయ్యారు.
● ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్